కోఠి, వెలుగు: కుల, మత, ప్రాంత, వర్గ, రాజకీయాలకు అతీతంగా హిందువులందరూ ఐక్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వీహెచ్పీలో చేరాలని ఆ సంస్థ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి పిలుపునిచ్చారు. ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించే వీహెచ్పీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు.
కోఠిలో ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మతమార్పిడులను అడ్డుకోవడం, గోహత్యల నిషేధానికి కృషి చేయడం, దేవాలయాల పరిరక్ష ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కరీంనగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవి, నాయకులు సత్యనారాయణ, బొక్కి సాయిలు, సత్యప్ప, ఎంగలి సిద్ధూ పాల్గొన్నారు.
