డీటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ గా రామకృష్ణ

డీటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ గా రామకృష్ణ

హైదరాబాద్, వెలుగు: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర నూతన నాయకత్వం ఏకగ్రీవంగా ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ బి. రామకృష్ణ (హైదరాబాద్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అటుకుల శ్రీనివాసరెడ్డి (హనుమకొండ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తూముల తిరుపతి (కరీంనగర్), ఎం. జయకృష్ణ (ఆదిలాబాద్).. రాష్ట్ర కార్యదర్శులుగా ఎ. గోవిందరావు (వరంగల్), బి. వెంకటేశం (నల్గొండ) ఎన్నికయ్యారు.

అలాగే, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులుగా డాక్టర్ జి. కళావతి (జనగాం) ఎన్నికైనట్లు సంఘం ప్రకటించింది. కాగా, డీటీఎఫ్‌‌‌‌కు తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌‌‌‌లో సభ్యత్వం లభించిన నేపథ్యంలో పదవీ విరమణ చేసిన బాధ్యుల స్థానంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు నేతలు పేర్కొన్నారు.