బంగ్లా 91.. దక్షిణాఫ్రికా 88/1.. తొలి రోజే సఫారీల ఆధిపత్యం!

బంగ్లా 91.. దక్షిణాఫ్రికా 88/1.. తొలి రోజే సఫారీల ఆధిపత్యం!

సెంచూరియన్‌‌‌‌: సౌతాఫ్రికాతో సోమవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో తడబడింది. బౌలింగ్​లో కగిసో రబాడ (3/23), మార్కో యాన్సెన్‌‌‌‌ (3/17) చెలరేగడంతో.. టాస్‌‌‌‌ ఓడిన దిగిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 33.3 ఓవర్లలో 91 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. మహిఫుజుల్‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌ (23) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తౌహిద్‌‌‌‌ హ్రిదోయ్‌‌‌‌ (19), మోమినల్‌‌‌‌ హక్‌‌‌‌ (18)తో సహా మిగతా అందరూ ఫెయిలయ్యారు. 

ఇన్నింగ్స్‌‌‌‌లో ఎనిమిది మంది సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌ స్కోరుకే పరిమితం కావడంతో బంగ్లా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అన్రిచ్‌‌‌‌ నోర్జ్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన సౌతాఫ్రికా ఆట ముగిసే టైమ్‌‌‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 17 ఓవర్లలో 88/1 స్కోరు చేసింది. అకెర్‌‌‌‌మన్‌‌‌‌ (46 బ్యాటింగ్‌‌‌‌), హమ్జా (9 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (21) నిరాశపర్చాడు. ఎబాదత్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ ఒక్క వికెట్‌‌‌‌ తీశాడు. ప్రస్తుతం బంగ్లా 3 రన్స్‌‌‌‌ వెనకబడి ఉంది.