గండిపేట: బీఆర్ఎస్ లీడర్ అక్రమ నిర్మాణం కూల్చివేత

గండిపేట: బీఆర్ఎస్ లీడర్ అక్రమ నిర్మాణం కూల్చివేత

గండిపేట, వెలుగు : అత్తాపూర్ పిల్లర్ నంబర్ 183 సమీపంలో బీఆర్​ఎస్ ​లీడర్​అక్రమంగా నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఉప్పర్‌‌‌‌పల్లిలోని పీఎన్‌‌‌‌ఆర్ అపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌కు సంబంధించిన ఖాళీ స్థలంలో బీఆర్‌‌‌‌ఎస్ రాజేంద్రనగర్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి అక్రమంగా నిర్మాణం చేపట్టారంటూ అపార్ట్‌‌‌‌మెంట్ వాసులు గతంలో కోర్టును ఆశ్రయించారు. అక్రమం నిజమేనని తేల్చి న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులు..పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు మొదలుపెట్టారు.