కర్నాటక స్కూళ్లలో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు

కర్నాటక స్కూళ్లలో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు

బెంగళూరు: కర్నాటకలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. నాణ్యమైన బయో డిగ్రేడబుల్ నాప్కిన్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. వీటి కోసం టాయిలెట్లలో వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేయాలని సూచించింది.

నియమాలను పాటించని ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్లు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పాఠశాలల్లో మూడు నెలల్లోగా పీరియడ్స్ సమయంలో అవసరమయ్యే అదనపు దుస్తులు, పారేసే బ్యాగులతో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలి. తాగునీరు, చేతులు కడుక్కునే వసతితో పాటు ఆడ, మగ పిల్లలకు విడివిడిగా టాయిలెట్లు ఉండాలి.