డిసెంబర్ 4 నుంచి ఓటీటీలోకి నివేదా థామస్ ‘శ్రీమతి’.. ట్రైలర్ విడుదల

డిసెంబర్ 4 నుంచి ఓటీటీలోకి నివేదా థామస్ ‘శ్రీమతి’.. ట్రైలర్ విడుదల

వైవిధ్యమైన పాత్రలతో నటిగా చక్కని గుర్తింపును అందుకున్న నివేదా థామస్.. ‘శ్రీమతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘స్కైలాబ్‌‌‌‌’ ఫేమ్‌‌‌‌ విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించాడు.  ప్రైమ్ షో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌మెంట్  బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. తిరువీర్‌‌‌‌, నివేదా థామ‌‌‌‌స్ కొత్తగా పెళ్లైన జంటగా కనిపించారు.  కొత్త కోడలుగా బెరుకు,  భయంతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన మధుశ్రీ.. అత్త,  మామలకు సేవ చేస్తుంది. భర్తకు ప్రేమానురాగాలు అందిస్తుంది. మెట్టినింటి ఆచార  వ్యవహారాలన్నీ నేర్చుకుంటుంది.

అయితే ఆ ఇల్లే తనలోకం అవుతుంది.  తను చదివిన చదువు, తనకు ఎంతో ఇష్టమైన  నృత్యం, తను కలలు కన్న భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. అడ్డంకులను  అధిగమించి తన కలను ఆమె ఎలా నెరవేర్చుకుంది అన్నది మిగతా కథ. రేణూ దేశాయ్‌‌‌‌, గోప‌‌‌‌రాజు ర‌‌‌‌మ‌‌‌‌ణ, హ‌‌‌‌రితేజ‌‌‌‌ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు.  డిసెంబర్ 4 నుంచి జీ5లో ఇది స్ట్రీమింగ్ కానుంది.