ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు ..15 మంది మృతి
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారింది. శీతాకాలం నేపథ్యంలో ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా రాజధాని కీవ్ పరిసర ప్రాంతాలపై సోమవారం జరిపిన దాడుల్లో కనీసం 15 మంది మృతి చెందారు. కీవ్‌కు ఉత్తరాన ఉన్న డైమర్ ప్రాంతంలో రష్యా దాడికి ఐదంతస్తుల అపార్ట్మెంట్ పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో ఓ టీనేజర్ సహా 11 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
79 ఏళ్ల వృద్ధురాలితో పాటు ఓ చిన్నారిని రెస్క్యూ బృందాలు రక్షించగా, మరో 11 మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. కీవ్ దక్షిణాన ఉన్న వైష్ణెవ్ నగరంలోని సూపర్ మార్కెట్‌పై జరిగిన దాడిలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. కాగా, లిబియా తీర సమీపంలో రష్యాకు చెందిన అత్యాధునిక ‘మెర్క్యూరీ’ యుద్ధనౌకను ఏడు నావల్ డ్రోన్లతో ముంచేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు.
