వేలంలో ధోనీ పాత్ర అది కాదు.. ఇర్ఫాన్ పఠాన్ బోల్డ్ కామెంట్స్!

వేలంలో ధోనీ పాత్ర అది కాదు.. ఇర్ఫాన్ పఠాన్ బోల్డ్ కామెంట్స్!

MS Dhoni: డిసెంబర్ 16న గోవాలో జరగబోయే IPL 2027 మినీ వేలం కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మెంటార్‌గా కొత్త అవతారం ఎత్తిన ఎంఎస్ ధోని (MS Dhoni), వేలం టేబుల్ దగ్గర కూర్చుని ఆటగాళ్లను కొంటారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. దీనిపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు వరుసగా 3 సీజన్లలో ప్లేఆఫ్స్ మిస్ అయిన చెన్నై జట్టులో అసలు లోపం ఎక్కడుందో మాజీ క్రికెటర్ పూసగుచ్చినట్లు వివరించారు.

వేలం టేబుల్ దగ్గర ధోని ఎందుకు ఉండరంటే: 

జియోస్టార్ షోలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. , మహేంద్ర సింగ్ ధోని స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంటుందో సింపుల్‌గా చెప్పేశారు. 

* మహీ రోల్ వేరు: ఎంఎస్ ధోని గురించి నాకు బాగా తెలుసు.. ఆయన అస్సలు వేలం టేబుల్ దగ్గర కూర్చోరు.. ఆయన ఇప్పుడు జట్టుకు మెంటార్. ఆటగాళ్లకు తన అనుభవాన్ని పంచడం, ఒత్తిడిలో మ్యాచ్‌లు ఎలా గెలవాలో నేర్పించడం మాత్రమే మహీ పని.. వేలంలో ఎవరిని కొనాలి, ఎంత వరకు బిడ్ చేయాలి అనేది మేనేజ్‌మెంట్ చూసుకుంటుంది. 

* టీమ్ మేనేజ్‌మెంట్‌పై నమ్మకం: ధోని ఎప్పుడూ విషయాలను కాంప్లికేట్ చేయరు.. ఎవరి పని వారిని చేసుకోనిస్తారు.. ఐదుసార్లు ఛాంపియన్ జట్టును నిర్మించిన స్ట్రాంగ్ మేనేజ్‌మెంట్ CSK సొంతం.. వాళ్లపై మహేంద్రుడికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది.

* క్రెడిట్ కోసం పాకులాడరు: మైదానం బయట తీసుకునే నిర్ణయాలకు క్రెడిట్ తీసుకోవడం, లైమ్‌లైట్‌లో ఉండటం ధోనికి ఇష్టం ఉండదు. ఆయన ఎప్పుడూ సైలెంట్‌గా తెరవెనుక నుంచే తన పని చేసుకుపోతారు. ఒకవేళ ఆయన వేలం టేబుల్ దగ్గర కనిపిస్తే నేనే షాక్ అవుతాను అని పఠాన్ తేల్చిచెప్పారు.

CSKకు టెన్షన్.. బౌలింగ్ వీక్‌నెస్ ఎలా తీరేది: 

* గత మూడు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరకపోవడానికి ప్రధాన కారణాలను అభినవ్ ముకుంద్ విశ్లేషించారు.

యువ ఆటగాళ్లపై ప్రయోగం ఫెయిల్: గత వేలంలో CSK యువ ఆటగాళ్లపై భారీగా ఖర్చు పెట్టి చేతులు కాల్చుకుంది. రూ. 14.2 కోట్లకు కొన్న ప్రశాంత్ వీర్‌కు సరైన అవకాశాలు రాలేదు, అతడు రాణించలేకపోయాడు. ఇప్పుడు అతడిని రిలీజ్ చేయడంతో చెన్నై పర్స్‌లోకి మళ్లీ డబ్బు వచ్చింది. ఇక రూ. 14 కోట్ల కార్తీక్ శర్మ కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడటంతో అతడిని రిటైన్ చేసుకున్నారు. 

* ప్లేయింగ్ XI లో ఎవరిని ఆడించాలి?: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, కార్తీక్ శర్మ, ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్.. ఇలా చెన్నై దగ్గర టాప్-ఆర్డర్ బ్యాటర్లు ఓవర్‌లోడ్ అయ్యారు. వీళ్లందరినీ ఒకే తుది జట్టులో ఆడించడం చాలా కష్టం.

* బౌలింగ్ కోసం ట్రేడ్ ప్లాన్: చెన్నై సూపర్ కింగ్స్ అసలు సమస్య బౌలింగ్.. విదేశీ కోటాలో లియామ్ లివింగ్‌స్టోన్, బ్రెవిస్, నూర్ అహ్మద్ పక్కాగా ఆడతారు. నాలుగో స్పాట్ జామీ ఓవర్టన్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి అకీల్ హొస్సేన్, నూర్ ఇద్దరూ కలిసి ఆడలేరు.. అందుకే CSK తమ దగ్గర ఎక్కువగా ఉన్న బ్యాటర్లలో ఒకరిని ఇతర జట్లకు ట్రేడ్ చేసి, బదులుగా ఒక మంచి భారత స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లను వేలంలో కొనుగోలు చేయాలని ముకుంద్ సూచించారు.