కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘రికార్డ్’ ప్రారంభం

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘రికార్డ్’ ప్రారంభం

విభిన్న  కథలతో వరుస సినిమాలు చేస్తున్న  కిరణ్ అబ్బవరం తాజాగా తన  నెక్స్ట్ మూవీని కూడా అనౌన్స్ చేశాడు. హీరోగా తనకిది14వ సినిమా కాగా, దీనికి ‘రికార్డ్’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫిక్స్ చేశారు. సుకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేట్ వీర కోగటం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్, వంశీ నందిపాటి ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్, ది స్టోరీస్ బ్యానర్లపై వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించడంతో పాటు టైటిల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

 ముహూర్తపు షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిల్ రాజు క్లాప్ కొట్టగా, సుకుమార్ కెమెరా స్విచాన్ చేశారు. బన్నీ వాసు గౌరవ దర్శకత్వం వహించారు.  నిర్మాతలు డీవీవీ దానయ్య, ఏషియన్ సునీల్ నారంగ్ తదితరులు హాజరై టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.  ఎర్రటి పౌర్ణమి చంద్రుడి నేపథ్యంలో కిరణ్ అబ్బవరం సిల్హౌట్, గాడిద, చీకట్లో నడుస్తున్న అమ్మాయి వంటి అంశాలతో రూపొందించిన టైటిల్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.

 ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘సుకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గారితో అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దర్శకుడు వీర చెప్పిన కథ, ఆయన తపన నాకు బాగా నచ్చాయి. ఈ సినిమా అందరూ గర్వపడేలా ఉంటుంది’ అని అన్నాడు.  కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా  ఓ మంచి సినిమా ఇస్తామని దర్శకుడు వీర కోగటం వెల్లడించారు.   ఈ 'రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌' సినిమా ఇండస్ట్రీలోని రికార్డ్ లన్నీ బద్దలు కొట్టే సినిమా కావాలని నిర్మాత వంశీ నందిపాటి ఆకాంక్షించారు.  జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.