విహార యాత్రలో విషాదం..స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. నలుగురు చిన్నారుల దుర్మరణం

విహార యాత్రలో విషాదం..స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. నలుగురు చిన్నారుల దుర్మరణం

యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. అగ్రా  లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై కన్నౌజ్ దగ్గర  స్కూల్ బస్సును ట్రక్కు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సు వెనక భాగం నుజ్జు నుజ్జయింది. స్కూల్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉండగా వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న నలుగురు చిన్నారి విద్యార్థులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో  35 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.  

కన్నౌజ్ జిల్లా థాథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పై మంగళవారం (నవంబర్ 24)ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో విహారయాత్ర (పిక్నిక్) ముగించుకుని తిరిగి వస్తున్న బస్సు ఎక్స్‌ప్రెస్‌వేపై నిలిచి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు మరియు ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు స్థానిక మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. 

ట్రక్కు ఢీకొట్టిన ధాటికి బస్సు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి, పలువురు చిన్నారులు లోపల చిక్కుకుపోయారు. స్థానికులు, పోలీసులు కలిసి చిన్నారులను బయటకు తీసి, అంబులెన్స్‌ల ద్వారా తిర్వా లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.