నేపాల్ లో భారీ భూకంపం.. భారత్,చైనా, భూటాన్ లోనూ కంపించిన భూమి

నేపాల్ లో భారీ భూకంపం.. భారత్,చైనా, భూటాన్ లోనూ కంపించిన భూమి

నేపాల్ లో మరోసారి భూకంపం సంభవించింది. కోశి ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో భారత్ లోని పలు రాష్ట్రాలతో పాటు భూటాన్, బంగ్లాదేశ్, చైనాలో భూప్రకంపనలు నమోదు అయ్యాయి. నేపాల్ లోని లెలెప్ దగ్గర భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

మంగళవారం (నవంబర్ 24) ఉదయం 7 గంటలకు భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైందని, భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో కదలికలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) పేర్కొంది.

ALSO READ : డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగొస్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన

భారత్ లోని బిహార్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ లోని జల్ పాయ్ గురి, అలీపుర్ దువార్, కోచ్ బెహార్ ప్రాంతాల్లో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బహుళ అంతస్తుల భవనాలు, కరెంట్ స్తంభాలు ఊగడంతో నివాసితులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు చెప్పారు.

అంతకుముందు తెల్లవారుజామున 3:39 గంటలకు అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో 2.5 తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్ సీఎస్ తెలిపింది. దీని కేంద్రం భూమికి 15 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.