కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. మల్లన్న దర్శనానికి 4 గంటల సమయం

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. మల్లన్న దర్శనానికి 4 గంటల సమయం

శ్రీశైలం: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాది మంది భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకుంటున్నారు.మరోవైపు దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు.స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శివనామస్మరణతో శ్రీశైల క్షేత్రం మారుమోగుతోంది. కార్తీక పౌర్ణమి వేళ మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలు వెలిగించారు. దీంతో శ్రీశైల క్షేత్రం దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతించారు.