పెళ్లిళ్లు, పండుగలు అనగానే మహిళలకు ముందుగా గుర్తొకు వచ్చేది పట్టుచీరలే.. చీరకట్టుకు అసలైన అందాన్ని ఇచ్చే పట్టుచీరలకు ఎప్పుడూ క్రేజ్ తగ్గదు. అయితే, ఇదే అదునుగా మార్కెట్లో డూప్లికేట్ (నకలి) పట్టుచీరలు విపరీతంగా పెరిగిపోయాయి. చూడటానికి అచ్చం ఒరిజినల్ పట్టులాగే కనిపించడంతో, ఏది అసలో.. ఏది నకిలీనో తెలియక చాలా మంది మోసపోతున్నారు. వేలకు వేలు పోసి కొనేముందు ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే ప్యూర్ పట్టుచీరను ఈజీగా కనిపెట్టేయొచ్చు.
ధర తక్కువగా ఉంటే ఖచ్చితంగా డౌట్ పడాల్సిందే:
మార్కెట్లో అసలైన ప్యూర్ పట్టుచీరల తయారీ ఖర్చు, నాణ్యత వల్ల అవి కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటాయి. ఎవరైనా మరీ తక్కువ ధరకే పట్టుచీరలు ఇస్తున్నామంటే మీరు ఖచ్చితంగా ఆలోచించాలి తీరాల్సిందే. కొనేముందే అది ఏ రకం పట్టు (కంచి, ధర్మవరం, పోచంపల్లి, బనారస్) అనేది తెలుసుకోవాలి.. ముందే ఒక క్లారిటీతో షాప్‌కు వెళ్లడం వల్ల సేల్స్‌మెన్ మాటలకు మోసపోకుండా ఉంటారు.
దారాన్ని బట్టి, బర్న్ టెస్ట్ ద్వారా చెక్:
* పట్టుచీర చివర్లలో (కొంగు దగ్గర) ఉండే దారాలను గమనించడం ద్వారా అసలు, నకిలీని ఈజీగా గుర్తించవచ్చు.
* సాఫ్ట్‌నెస్ చెక్: అసలైన పట్టుదారాలు చాలా మృదువుగా (Soft), నేచురల్ మెరుపుతో ఉంటాయి. అదే నకిలీ దారాలైతే కాస్త గరుకుగా, గట్టిగా తగులుతాయి.
* బర్న్ టెస్ట్ (Burn Test): చీర అంచు నుంచి ఒక చిన్న దారం తీసి కాల్చి చూడండి. అసలైన పట్టుదారం అంత త్వరగా కాలదు, కాలిన తర్వాత చిన్న పూసలా మారి, చేతితో నలిపితే పౌడర్ (బూడిద) లాగా అయిపోతుంది. అదే పాలిస్టర్, నైలాన్, రేయాన్ లాంటి నకిలీ దారాలైతే ప్లాస్టిక్‌లా వెంటనే కాలిపోయి గట్టిగా అతుక్కుపోతాయి. వేలకు వేలు పోసి చీర కొనేటప్పుడు ఈ టెస్ట్ చేయడంలో అస్సలు మొహమాటపడొద్దు.
ALSO READ : మతాంతర వివాహాలను.. హిందూచట్టం కింద నమోదు చేయలేం: మద్రాస్ హైకోర్టు
ఓవర్ షైనింగ్ అస్సలు మంచిది కాదు:
* సహజమైన మెరుపు: పట్టుచీర మరీ ఎక్కువగా మెరిసిపోతున్నా, లేదా అస్సలు మెరుపు లేకుండా డల్‌గా ఉన్నా అది ఫేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒరిజినల్ పట్టుకు బంగారం లాంటి హుందా అయిన మెరుపు (Natural Golden Lustre) ఉంటుంది.
* గోరు టెస్ట్ (Nail Scratch Test): చీరపై సున్నితంగా గోరుతో గీత గీసి చూడండి.. అసలైన పట్టుచీరపై ఎలాంటి గీతలు లేదా మచ్చలు పడవు.. కానీ డూప్లికేట్ పట్టుపై మాత్రం గోరు గీతలు వెంటనే పడిపోతాయి.
