10 గ్రాములకు రూ.3వేల 220 తగ్గిన గోల్డ్.. కేజీకి రూ.10వేలు తగ్గిన వెండి: హైదరాబాద్ రేట్లివే!

10 గ్రాములకు రూ.3వేల 220 తగ్గిన గోల్డ్.. కేజీకి రూ.10వేలు తగ్గిన వెండి: హైదరాబాద్ రేట్లివే!

బంగారం, వెండి ధరలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. గడచిన రెండు రోజులుగా కొద్దిగా పెరిగిన గోల్డ్ రేట్లు బుధవారం రోజున అమాంతం జారిపడ్డాయి. ఈ క్రమంలో కార్తీకమాసంలో శుభకార్యాల కోసం షాపింగ్ చేద్దాం అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమకు సమీపంలోని పట్టణాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం మంచిది. 

హైదరాబాద్ లో 2026, నవంబర్ 25వ తేదీ బంగారం ధరలు ఇలా ఉన్నాయి :

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 24 వేల 580 రూపాయలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 14 వేల 200 రూపాయలు
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : 93 వేల 440 రూపాయలు

ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ సిటీలో కిలో వెండి : లక్షా 65 వేల రూపాయలు

నవంబర్ 25న బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాముకు 3వేల220 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.12వేల 458గా కొనసాగుతోంది. బుధవారం రోజున రూ.లక్షా 24 వేల 580కి చేరుకుంది. అలాగే ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.11వేల 420గా కొనసాగుతోంది. అంటే 10 గ్రాముల బంగారం రేటు అంటే తులం రూ.లక్షా 14 వేల 200 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 25, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.10వేలు తగ్గిపోయింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.లక్షా 65వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.165 దగ్గర ఉంది. రానున్న రోజుల్లో ఈ రేట్లు ఇంకా తగ్గొచ్చని బులియన్ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.