క్విక్ కామర్స్‌కు కాసుల వర్షం.. మూడు రోజుల్లో రూ.2వేల500 కోట్ల సేల్స్

క్విక్ కామర్స్‌కు కాసుల వర్షం.. మూడు రోజుల్లో రూ.2వేల500 కోట్ల సేల్స్

న్యూఢిల్లీ: దీపావళి పండుగ సీజన్‌‌‌‌లో బ్లింకిట్​, అమెజాన్​ నౌ, స్విగ్గీ ఇన్​స్టామార్ట్​ వంటి క్విక్‌‌‌‌ కామర్స్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లకు భారీగా ఆర్డర్లు వచ్చాయి.  ఈ నెల 6 నుంచి 8 వరకు.. అంటే మూడు రోజుల్లో మొత్తం రూ.2,500 కోట్ల విలువైన అమ్మకాలు సాధించాయి. ఈ సమయంలో 4.4 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు రెడ్‌‌‌‌సీర్‌‌‌‌ నివేదిక వెల్లడించింది. గత ఏడాది దీపావళి సీజన్‌‌‌‌తో పోలిస్తే అమ్మకాల విలువ 1.8 రెట్లు పెరిగింది. వీటిలో ధన్‌‌‌‌తేరస్‌‌‌‌ రోజే రూ.900 కోట్ల వరకు అమ్మకాలు జరిగాయి. 2025లో ఇదే రోజున రూ.490 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఆ రోజు సుమారు 1.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. పండుగ రోజుల్లో సాధారణ కిరాణా సరుకులతో పాటు డ్రై ఫ్రూట్స్‌‌‌‌, పప్పులు, బియ్యం, డ్రై ఫ్రూట్స్, స్వీట్ల​ కొనుగోళ్లు  2.5 రెట్లు పెరిగాయని నివేదిక వివరించింది.