తండ్రీ కూతుళ్ల రిలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గొప్పగా చూపించాం 

తండ్రీ కూతుళ్ల రిలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గొప్పగా చూపించాం 

విజయ్ ఆంటోని, ప్రీతి అస్రానీ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించిన చిత్రం ‘నాన్న కుట్టి’. ము.మారన్ దర్శకుడు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ ఆంటోని 
నిర్మించారు.  రామాంజనేయులు జవ్వాజీ కో ప్రొడ్యూసర్. ఈనెల 27న సినిమా రిలీజ్. మంగళవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  ‘కిష్కింధపురి’
 డైరెక్టర్ కౌశిక్ అతిథిగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు.

హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ ‘గత వారం తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. చూసినవాళ్లంతా సెకండాఫ్ ఎమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉందని మెచ్చుకుంటున్నారు. ‘బిచ్చగాడు’ నచ్చిన అందరికీ ఇదీ నచ్చుతుంది. ప్రీతి అస్రానీ అద్భుతంగా నటించింది.  తెలుగులో విడుదల చేస్తున్న సురేష్ బాబు గారికి థ్యాంక్స్’ అని చెప్పారు. నాన్న గొప్పదనం, త్యాగాన్ని చూపిస్తూ నాన్న ప్రేమను సెలెబ్రేట్ చేసేలా ఈ సినిమా ఉంటుందని ప్రీతి అస్రానీ చెప్పింది. తండ్రీకూతుళ్ల రిలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అద్భుతంగా చూపించామని, దర్శకుడు ము.మారన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. మగవాళ్లందరికీ ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నట్టు నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని చెప్పారు. లారా విజయ్ ఆంటోని, రచయిత భాష్యశ్రీ,  సింగర్ మౌషిమి నేహా పాల్గొన్నారు.