మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలేల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మరాఠీ చిత్రం ‘ఫూలే’. అనంత్ మహదేవన్ దర్శకుడు. డా. పొన్నం రవిచంద్ర నిర్మించారు. జ్యోతిరావ్ ఫూలేగా ప్రతీక్ గాంధీ, సావిత్రిబాయి ఫూలేగా పత్రలేఖ నటించారు. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసించారు.
మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సోషల్ యాక్టివిస్ట్ విమలక్క, రచయిత పసునూరి రవీందర్, టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని.. ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయం అని, అలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరారు. నిర్మాత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ ‘సుమారు 200 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను నేటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని చెప్పారు.
