హైదరాబాద్ లో ‘ఖేలో ఇండియా గ్లోబల్ క్విజ్’ ప్రారంభం.. తెలంగాణ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం

హైదరాబాద్ లో ‘ఖేలో ఇండియా గ్లోబల్ క్విజ్’ ప్రారంభం.. తెలంగాణ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం

హైదరాబాద్, వెలుగు: ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026’లో భాగంగా యువతలో క్రీడా అవగాహన పెంచి, రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం ‘ఖేలో ఇండియా గ్లోబల్ క్విజ్’ను ప్రారంభించింది. 

హైదరాబాద్‌‌లోని మినిస్టర్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌‌ లో మంగళవారం కార్యక్రమంలో  క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ క్విజ్‌‌ను లాంఛనంగా ప్రారంభించగా,  యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ డాక్టర్​ ఎ. సోనిబాల దేవి పాల్గొన్నారు. 

ఈ గేమ్స్‌‌ ను కేవలం క్రీడా పోటీలకే పరిమితం చేయకుండా, యువతకు స్ఫూర్తినిస్తూ దేశవిదేశాల్లోని ప్రజలు తెలంగాణతో అనుసంధానమై రాష్ట్రం గురించి తెలుసుకునే వేదికగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. క్విజ్‌‌లో పాల్గొన్న అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్, 20కి గాను 15 మార్కులకు పైగా సాధించిన వారికి మెరిట్ సర్టిఫికెట్,  తెలంగాణకు చెందిన విజేతలకు ప్రత్యేక బహుమతులు ప్రకటిస్తామని తెలిపారు.