బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్న ‘రామాయణ’ చిత్రం మరో అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక 32వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల షార్ట్ లిస్ట్‌లో ఏకంగా రెండు విభాగాల్లో ఈ చిత్రం చోటు సంపాదించింది. క్రిటిక్స్ ఛాయిస్ అసోసియేషన్ సోమవారం ప్రకటించిన షార్ట్‌లిస్ట్‌లో ‘బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ స్టంట్ డిజైన్ విభాగాల్లో నిలిచింది.
ఈ రెండు విభాగాల్లోనూ ప్రపంచ స్థాయి దిగ్గజ హాలీవుడ్ సినిమాలతో ‘రామాయణ’ పోటీ పడనుండటం విశేషం. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘ది ఒడిస్సీ’, డెనిస్ విల్లెన్యూవ్ తెరకెక్కించిన ‘డ్యూన్: పార్ట్ 3’, గాడ్జిల్లా మైనస్ జీరో, స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే వంటి భారీ చిత్రాలతో పోటీపడుతుంటడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 12 విభాగాలకు గాను ప్రతి విభాగంలో ఆరు చిత్రాలు నామినేషన్స్ దక్కించుకోనున్నాయి. తుది నామినేషన్స్‌ను డిసెంబర్ 4న ప్రకటిస్తారు. జనవరి 3న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో జరగనున్న వేడుకలో విజేతలను ప్రకటిస్తారు. ఆస్కార్ పురస్కారాలకు దిశానిర్దేశం చేసే ఈ అవార్డుల రేసులో ‘రామాయణ’ ఉండటంతో భారతీయ సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
