వీడు ఇందుకోసమే పుట్టాడురా అని కొన్ని సార్లు కొందరిని అంటుంటారు. ఆయా రంగాల్లో అప్పటి వరకు ఎవరూ సాధించలేనిది.. లేదా అందరికంటే డిఫరెంట్ గా.. గొప్పగా చేసినప్పుడు ఇలా పోల్చుతుంటారు. వైభవ్ విషయంలో కూడా ఆ మాట అనొచ్చునని 2026 నవంబర్ 24న చేసిన డబుల్ సెంచరీ చూశాక చెప్పొచ్చేమో. ఎందుకంటే 15 ఏళ్ల వయసులో కేవలం 52 బంతులలో డబుల్ సెంచరీ చేయడం. వండే చరిత్రలో ఏ క్రికెట్ లో ఉన్న అన్ని రికార్డులు తిరగరాయటం. అందుకే సీనియర్లు ఈ చిచ్చరపిడుగుపై కామెంట్లతో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. వైభవ్ బ్యాటింగ్ పై ఎవరేం కామెంట్స్ చేశారో చూద్దాం.
వైభవ్ లాంటి బ్యాటర్ లేరు: సెహ్వాగ్
వైభవ్ వీరబాదుడుపై సిక్సర్ల వీరుడు.. టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వైభవ్ సూర్యవంశీ లాంటి బ్యాటర్ మరొకరు లేరని సెహ్వాగ్ చెప్పడం అతిపెద్ద ప్రశంసగా మిగిలిపోతుంది.
🚨 MASSIVE STATEMENT BY VIRENDAR SEHWAG ON VAIBHAV SURYAVANSHI 🚨 Virendar Sehwag Said 🗣️: "There is no one quite like Vaibhav Suryavanshi. He possesses an extraordinary talent that sets him apart from everyone else. Honestly, every time I watch him play, he leaves me more amazed than before. Scoring 200 runs off just 52 balls in ODI cricket is absolutely unbelievable. It's something truly extraordinary. I genuinely believe this is just the beginning. He has the potential to surpass everyone and rule the world of white-ball cricket in the years to come. A huge congratulations to Vaibhav for creating history."👏❤️
— lndian Sports Network (@IS_Netwrk29) November 24, 2026
వైభవ్ ఆటతీరు చూస్తే.. అందిరికంటే అతనిలో ఎక్స్ ట్రార్డినరీ ట్యాలెంట్ ఉందని అనిపనిస్తుంది. 52 బంతులలో 200 కొట్టడం నమ్మలేని విషయం. ఇది ఆరంభం మాత్రమే. వైట్ బాల్ క్రికెట్ ను వైభవ్ ఏలేస్తాడనటంలో సందేహం లేదు అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.
వైభవ్ అందరినీ దాటేస్తాడు: గేల్
వైభవ్ గురించి గతంలో చెప్పాను.. ఇప్పుడు చెప్తున్నాను.. ఈ చిచ్చరపిడుగు క్రికెట్ చరిత్రలో అందరినీ దాటేస్తాడు. అన్ని రికార్డులను తిరగరాస్తాడు.. నా రికార్డులను తిరగరాయాలంటే అది వైభవ్ కే సాధ్యం అంటూ సిక్సర్ల సంచలనం క్రిస్ గేల్ కామెంట్ చేశాడు. ఇలాంటి రికార్డును చూస్తానని అనుకోలేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
🚨 MASSIVE STATEMENT BY CHRIS GAYLE ON VAIBHAV SURYAVANSHI 🚨 Chris Gayle Said 🗣️, “I had already said that if anyone could break my record, it would only be Vaibhav Suryavanshi. I’m truly very happy today that Vaibhav Suryavanshi has broken my record for most sixes in a single season. Breaking this record at just 15 years of age is not an easy thing, and no one in the world has managed to do it at such an age. Vaibhav Suryavanshi is a special talent. A talent like him not just me, but many players like me have never seen in their lives. Truly, Vaibhav Suryavanshi is an extraordinary player. The BCCI should take proper care of him because he is going to become a huge asset for India. What a fearless player”
— lndian Sports Network (@IS_Netwrk29) May 27, 2026
50 బాల్స్ లో డబుల్ చేయడం వైభవ్ కే సాధ్యం: పాంటింగ్.
వండేల్లో 50 బాల్స్ లో డబుల్ చేయడం వైభవ్ కే సాధ్యమని క్రికెట్ లెజెండ్ పాంటింగ్ అన్నారు. 53 బాల్స్ లో 35 బౌండరీలు, అందులో 28 సిక్సులు, 7 ఫోర్లు.. ఇది నమ్మలేని విషయం. కానీ నమ్మితీరాలి అంటూ కామెంట్స్ చేశారు.
🚨 MASSIVE STATEMENT BY RICKY PONTING ON VAIBHAV SURYAVANSHI AGLFTER UNBELIEVABLE DOUBLE CENTURY INNINGS 🚨 Ricky Ponting Said 🗣️: "Honestly, this is an absolutely unbelievable innings. It's hard to imagine someone scoring a double century in just 50 balls in ODI cricket. Vaibhav Suryavanshi is truly an exceptional talent. 35 boundaries in just 53 balls 28 sixes and 7 fours. This is simply unbelievable. The BCCI should take special care of Vaibhav Suryavanshi, nurture his talent and give him all the support he deserves. A talent like this doesn't come around often. Players like him are born once in a generation."
— lndian Sports Network (@IS_Netwrk29) November 24, 2026
నా రికార్డు చిన్నబోయింది: సురేష్ రైనా
వైభవ్ బ్యాటింగ్ పై మాజీ స్టార్ బ్యాటర్ సురేష్ రైనా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలాంటి బ్యాంటింగ్ మరెక్కడా చూడలేదని ట్వీట్ చేశాడు. వైభవ్ రికార్డు ముందు తన రికార్డు చిన్నబోయినట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్ లో 2014లో 25 బంతులలో రైనా 87 రన్స్ చేశాడు. అది అప్పట్లో సెన్సేషనల్ ఇన్నింగ్స్. ఆ రికార్డు ఇప్పుడు చిన్నబోయిందని రైనా పేర్కొనటం విశేషం.
a phenomenal talent! 👏🔥 A double century at such a young age speaks volumes about Vaibhav Sooryavanshi’s fearless mindset and extraordinary ability. Keep dreaming big, keep shining, young champion! 🇮🇳🏏 #VaibhavSooryavanshi https://t.co/QXPPuVUizR
— Suresh Raina🇮🇳 (@ImRaina) November 24, 2026
రికార్డులను బ్రేక్ చేయడం కాదు.. తిరగరాయడం: కైఫ్
వైభవ్ రికార్డులను బ్రేక్ చేసేందుకు వేచి చూడటం లేదు.. రికార్డులను తిరగరాసేందుకు కదులుతున్నాడు అంటూ మాజీ క్రికెటర్ - మహమ్మద్ కైఫ్ పొగడ్తల వర్షం కురిపించారు.
వైభవ్ విధ్వంసం:
ఇండియా, UAE అండర్ 19 క్రికెట్ పోటీల్లో భాగంగా.. 2026, నవంబరన్ 24వ తేదీన దోహాలో జరిగిన మ్యాచ్ లో.. ఇండియన్ కుర్రోడు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ తో రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కేవలం 52 బంతుల్లోనే 200 పరుగులు చేసి ప్రపంచాన్ని షాకింగ్ కు గురిచేశాడు.
52 బంతులలో డబుల్ సెంచరీ అంటే ఊహించుకోండి ఏ రేంజ్ లో కొట్టాడో అని.. 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు.. ఆ తర్వాత అయినా తగ్గాడా అంటే అదీ లేదు.. 40 బంతుల్లో 150 పరుగులు చేశాడు.. ఆ తర్వాత ఏ మాత్రం మనోడు తగ్గలేదు. 52 బంతుల్లో 200 పరుగులు చేశాడు. ఫస్ట్ 16 బంతుల్లో 50 పరుగులు చేసిన వైభవ్.. ఆ తర్వాత 12 బంతుల్లోనే మరో 50 పరుగులు చేసి.. సెంచరీ పూర్తి చేశాడు.
వైభవ్ దెబ్బకు అంతకు ముందున్న రికార్డులు చిన్నబోయాయనే చెప్పాలి. తక్కువ బంతులలో డబుల్ సెంచరీ రికార్డు అంతకు ముందు ఇంగ్లండ్ బ్యాటర్ హారీ బ్రూక్ పేరున ఉండేది. 2026లో శ్రీలంకపై 114 బంతులలో 200 పరుగులు సాధించి ఇప్పటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
