టీమిండియాకు మొనగాడు.. ప్రత్యర్థులకు మొగుడు దొరికేశాడు : హోరెత్తుతున్న వైభవ్ సూర్యవంశీ

టీమిండియాకు మొనగాడు.. ప్రత్యర్థులకు మొగుడు దొరికేశాడు : హోరెత్తుతున్న వైభవ్ సూర్యవంశీ

టీమిండియా.. యంగ్ కుర్రోళ్లతో కళకళలాడే రోజులు వచ్చేశాయి. అప్పట్లో గవాస్కర్.. ఆ తర్వాత సచిన్ అనుకునే వాళ్లం.. ఇప్పుడు ఎవరూ అంటే వైభవ్ సూర్యవంశీ అనే స్థాయికి వచ్చేశాడు ఈ 15 ఏళ్ల కుర్రోడు. క్రికెట్ లో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొడుతూ.. సరికొత్త రికార్డులు క్రికెట్ చేస్తున్నాడు. 
సూర్యవంశీ ఆటను చూస్తున్న అందరూ.. ఒక్కటే మాట అంటున్నారు..
టీమిండియాకు మొనగాడు దొరికాడు..
మిగతా జట్లకు మొగుడు వచ్చాడు అని..
అప్పట్లో గవాస్కర్, సచిన్ టెండూల్కర్ ను ఔట్ చేయాలంటే ప్రత్యర్థులకు చుక్కలే..
సచిన్ గ్రౌండ్ లోకి దిగాడంటే ఓడిపోయే మ్యాచ్ గెలుస్తుందనే నమ్మకం.. 
ఇప్పుడు అలాంటి ధీమా.. భరోసా ఇస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ..
టీమిండియాలో మొనగాడు అంటున్నారు సోషల్ మీడియా నెటిజన్లు..
ఇదే ఆట టీమిండియాకు ఆడితే.. నా సామి రంగా.. మిగతా దేశాలు అన్నీ అల్లకల్లోలమే.. మనోడు దెబ్బకు మటాష్ అంటున్నారు క్రికెట్ లవర్స్..

ఇండియా, UAE అండర్ 19 క్రికెట్ పోటీల్లో భాగంగా.. 2026, నవంబరన్ 24వ తేదీన దోహాలో జరిగిన మ్యాచ్ లో.. ఇండియన్ కుర్రోడు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉంది. 52 బంతుల్లోనే 200 పరుగులు.. అంటే ఊహించుకోండి ఏ రేంజ్ లో కొట్టాడో అని.. 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు.. ఆ తర్వాత అయినా తగ్గాడా అంటే అదీ లేదు.. 40 బంతుల్లో 150 పరుగులు చేశాడు.. ఆ తర్వాత ఏ మాత్రం మనోడు తగ్గలేదు. 52 బంతుల్లో 200 పరుగులు చేశాడు. ఫస్ట్ 16 బంతుల్లో 50 పరుగులు చేసిన వైభవ్.. ఆ తర్వాత 12 బంతుల్లోనే మరో 50 పరుగులు చేసి.. సెంచరీ పూర్తి చేశాడు.

వైభవ్ దెబ్బకు అంతకు ముందున్న రికార్డులు చిన్నబోయాయనే చెప్పాలి. తక్కువ బంతులలో డబుల్ సెంచరీ రికార్డు అంతకు ముందు ఇంగ్లండ్ బ్యాటర్ హారీ బ్రూక్ పేరున ఉండేది. 2026లో శ్రీలంకపై 114 బంతులలో 200 పరుగులు సాధించి ఇప్పటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్నాడు.