ఈ బుడ్డోడు ఏంటో.. వీడి వీరబాదుడు ఏంటో.. ఇండియా, యూఏఈ మధ్య జరిగిన టీం ఇండియా ఏ క్రికెట్ మ్యాచ్ లో పిచ్చెక్కించేశాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కామెంటేటర్లకే మైండ్ బ్లోయింగ్ ఇచ్చాడు. బాల్ బాల్ కు బాదుడే..
కార్పొరేట్ కాలేజీల ర్యాంకులు మాదిరి.. ఫోర్.. ఫోర్.. సిక్స్.. సిక్స్.. సిక్స్.. ఫోర్.. సిక్స్. ఫోర్..
ఏదైనా ఎంట్రెన్స్ రిజల్ట్స్ వచ్చినపుడు కార్పోరేట్ కాలేజీల అనౌన్స్ మెంట్ ఎలా ఉంటుందో.. అలా సాగింది కామెంటేటర్ల అనౌన్స్ మెంట్స్.. నాలుగు నాలుగు ఆరు ఆరు ఆరు నాలుగు ఆరు ఆరు ఆరు నాలుగు అంటూ స్టేడియం దద్దరిల్లింది.
ఇలా 52 బంతులకు స్కోర్ బోర్డు పరిగెత్తించేశాడు వైభవ్ సూర్యవంశీ
కామెంటేటర్లు సైతం.. బాల్ బాల్ కు స్కోర్ అమాంతం పెరగటం.. ఆ వీర బాదుడు చూసి వైభవ్ సూర్యవంశీలో ఏమైనా దూరిందా అన్నట్లు కామెంట్లు చేయటం విశేషం..
ఏదైనా మ్యాచ్ లో ఓవర్ కు ఒకటో రెండో సిక్సులు పడినప్పుడు కామెంటేటర్ల హడావుడి ఉంటుంది. సిక్సు, ఫోర్ అంటూ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించే ప్రయత్నం చేస్తుంటారు. మళ్లీ సిక్సు,ఫోర్ పడేవరకు కాస్త రిలాక్స్ అవుతుంటారు. కానీ ఈ మ్యాచ్ లో ఎక్కువగా అలసిపోయిందంటే కామెంటేటర్లేనేమో. కనీసం గ్యాప్ లేకుండా.. గుక్క తిప్పుకునే లోపే బౌండరీలు. దీంతో అరవలేక పోయారంటే ఆశ్చర్యం కాదు.
అదే విధంగా ఫ్యాన్స్ మ్యాచ్ ఆద్యంతం ఒక్కసారి కూడా కూర్చోకుండా.. లేచి వైభవ్ బ్యాటింగ్ సెలెబ్రేట్ చేసుకున్నారు. ప్రతి బాల్ కు కేరింతలతో స్టేడియం మొత్తం అల్లల్లాడిపోయింది. టీ20 మ్యాచులో కూడా ఇంత హోరు, హుషారు ఉంటుందో లేదో అంటే నమ్మాల్సిందే.
ఇండియా, UAE అండర్ 19 క్రికెట్ పోటీల్లో భాగంగా.. 2026, నవంబరన్ 24వ తేదీన దోహాలో జరిగిన మ్యాచ్ లో.. ఇండియన్ కుర్రోడు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉంది. 52 బంతుల్లోనే 200 పరుగులు.. అంటే ఊహించుకోండి ఏ రేంజ్ లో కొట్టాడో అని.. 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు.. ఆ తర్వాత అయినా తగ్గాడా అంటే అదీ లేదు.. 40 బంతుల్లో 150 పరుగులు చేశాడు.. ఆ తర్వాత ఏ మాత్రం మనోడు తగ్గలేదు. 52 బంతుల్లో 200 పరుగులు చేశాడు. ఫస్ట్ 16 బంతుల్లో 50 పరుగులు చేసిన వైభవ్.. ఆ తర్వాత 12 బంతుల్లోనే మరో 50 పరుగులు చేసి.. సెంచరీ పూర్తి చేశాడు.
వైభవ్ దెబ్బకు అంతకు ముందున్న రికార్డులు చిన్నబోయాయనే చెప్పాలి. తక్కువ బంతులలో డబుల్ సెంచరీ రికార్డు అంతకు ముందు ఇంగ్లండ్ బ్యాటర్ హారీ బ్రూక్ పేరున ఉండేది. 2026లో శ్రీలంకపై 114 బంతులలో 200 పరుగులు సాధించి ఇప్పటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
