టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' మూవీ చుట్టూ వివాదాలు ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో జాన్వీకపూర్ ను చూపించిన విధానం, ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై దర్శకుడు సైతం స్పందించి క్షమాణణలు కూడా చెప్పారు. ఆ తర్వాత జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు కూడా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
అయితే ఈ వివాదంపై సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన శ్రుతిహాసన్ స్పందించడం ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ గా తన కొత్త సినిమా 'ఆకాశంలో ఒక తార' ప్రమోషన్లలో బిజీగా ఉన్న శ్రుతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ 'పెద్ది'సినిమాలోని పాట వివాదం, జాన్వీ కపూర్ వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. దీనికి " మరొకరి అనుభవం గురించి నేను మాట్లాడటం సరైనది కాదు. వాళ్ల పరిస్థితి, వాళ్లకు ఎదురైన అనుభవాలు నాకు పూర్తిగా తెలియవు. అలాగే నా తరఫున కూడా మరొకరు మాట్లాడలేరు. అందుకే ఆ వివాదంలోకి వెళ్లదలుచుకోలేదు" అని శ్రుతి సమాధానం ఇచ్చారు.
అంతేకాదు.. ఐటమ్ సాంగ్స్ చేయడంపై స్పందిస్తూ.. గతంలోనూ ఇలాంటి పాటల్లో నటించానని, డ్యాన్స్ చేయడం, అందంగా ముస్తాబవడం, గ్లామరస్‌గా కనిపించడం తనకు ఇష్టమని చెప్పారు. అయితే ఇతరులను మెప్పించడానికి మాత్రం అలాంటి పాటలు చేయనని స్పష్టం చేశారు. తనకు నచ్చని దుస్తులు ధరించనని కూడా అన్నారు.
ఇక 'హెల్లల్లో' పాట చిత్రీకరణ సమయంలో తన కంఫర్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చాన్నారు. షూటింగ్స్ లో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే తన టీమ్‌తో బహిరంగంగా చర్చించానని శ్రుతి వెల్లడించారు.. షూటింగ్లో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ కొన్నిసార్లు కొన్ని అంశాలు గుర్తించకుండా మిగిలిపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తానికి జాన్వీ వివాదంపై నేరుగా స్పందించకుండానే తన వైఖరిని స్పష్టం చేసిన శ్రుతిహాసన్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
#ShruthiHaasan about her special song’s #Peddi https://t.co/w8MYzaVXNu
— Panchayat Circle (@PanchayatCircle) November 23, 2026
