53 బంతుల్లో 204 కొట్టడం ఏంటయ్యా.. వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 14.2 ఓవర్లలో 250 టార్గెట్ను ఊదేశారు !

53 బంతుల్లో 204 కొట్టడం ఏంటయ్యా.. వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 14.2 ఓవర్లలో 250 టార్గెట్ను ఊదేశారు !

టీమిండియా-ఏ జట్టు యూఏఈ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యూఏఈ జట్టు 249 పరుగులు చేయగా, టీమిండియా 3 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ వన్డే మ్యాచ్లో మునుపెన్నడూ చూడని అద్భుతం జరిగింది. ఎవరూ ఊహించని అసాధ్యాన్ని టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సుసాధ్యం చేశాడు. 53 బంతుల్లో 28 సిక్సులు, 7 ఫోర్లతో 204 పరుగులు చేసి యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250 టార్గెట్లో బరిలోకి దిగిన టీమిండియా-ఏ జట్టు 3.3 ఓవర్లలోనే 68 పరుగులు చేసి ఆరంభం నుంచే అదుర్స్ అనిపించింది. అభిషేక్ శర్మ వికెట్ పడిన తర్వాత కూడా టీమిండియా జోరు కొనసాగింది. 5.4 ఓవర్ల దగ్గర 108 పరుగులకు రెండో వికెట్ కోల్పోయింది.

ఇక ఆ తర్వాత నుంచి మొదలైంది అసలు కథ. 245 పరుగుల వరకూ మూడో వికెట్ పడలేదు. స్టేడియంలో సిక్సుల వర్షం కురిసింది. పది కాదు, ఇరవై కాదు, ఏకంగా 28 సిక్సులు కొట్టి వైభవ్ సూర్యవంశీ తన రికార్డులను తనే తిరగరాసుకున్నాడు. 384.90 హైయెస్ట్ స్ట్రైక్ రేట్ సాధించి అదరగొట్టాడు.

ఏబీ డివిలియర్స్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ రికార్డులు బద్ధలైపోయాయి. 80 నిమిషాలు, 14 ఓవర్లు, 250 పరుగుల టార్గెట్ ఫినిష్. వైభవ్ సూర్యవంశీ రికార్డుల విషయానికొస్తే.. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ, 28 బంతుల్లో సెంచరీ, 52 బంతుల్లో డబుల్ సెంచరీ.. టీమిండియా-ఏ జట్టు చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ను దోహాలో సువర్ణాక్షరాలతో లిఖించింది.