టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా అక్కినేని నాగచైతన్య ‘వృషకర్మ’ గురించే చర్చ! ఓవైపు సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతుంటే.. మరోవైపు దర్శకుడు కార్తీక్ దండు చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతన్య పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ షేర్ చేసిన ఈ బర్త్‌డే నోట్‌లో వారి మూడేళ్ల ప్రయాణం, స్నేహం, సినిమా కోసం పడిన కష్టం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
డైరెక్టర్ టు ఫ్యామిలీ.. మూడేళ్లలో మారిన బంధం!
“ప్రపంచం ముందు ఇద్దరం ఇంట్రోవర్ట్స్‌మే.. కానీ ఒకరితో ఒకరం ఉన్నప్పుడు మాత్రం మా అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకుంటాం. మూడేళ్ల క్రితం డైరెక్టర్, హీరోగా మొదలైన మా ప్రయాణం.. ఎప్పుడు స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా, కుటుంబ సభ్యుల్లాంటి బంధంగా మారిందో తెలియదు” అంటూ కార్తీక్ రాసుకొచ్చారు.
లేట్ నైట్ డిస్కషన్స్, కష్టమైన షూటింగ్ షెడ్యూల్స్, చిన్న చిన్న విజయాలు.. ఇలా ప్రతి సందర్భం తమ బంధాన్ని మరింత బలపరిచిందని తెలిపారు. చైతన్యలోని నిరాడంబరత, హార్డ్ వర్క్, ప్రతి ఫ్రేమ్ కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని ప్రశంసించారు.
చైతూలో సరికొత్త కోణం చూస్తారు..
ఇక ఈ డిసెంబర్ 4న ప్రేక్షకులు తెరపై సరికొత్త నాగచైతన్యను చూడబోతున్నారని కార్తీక్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ‘వృషకర్మ’ చైతన్యకు ఆయన అర్హుడైన విజయాన్ని అందించాలని కోరుకున్నారు. తనను, తన కథను, కేవలం ఓ ఆలోచనగా ఉన్న ఈ కలను నమ్మినందుకు చైతన్యకు థ్యాంక్స్ చెప్పారు.
కార్తీక్ పోస్ట్‌కు చైతూ రిప్లై.. ఫ్యాన్స్ ఫిదా!
దర్శకుడి ఎమోషనల్ పోస్ట్‌కు నాగచైతన్య కూడా అంతే ప్రేమతో స్పందించారు. “నీ మాటలకు థ్యాంక్యూ కార్తీక్. ఇవి నాకు ఎంతో ప్రత్యేకం. మన మధ్య ఉన్న అనుబంధానికి నిజంగా కృతజ్ఞుడిని. ‘వృషకర్మ’తో నువ్వు ఏం సృష్టించావో ప్రేక్షకులందరూ చూసే రోజు కోసం ఎదురుచూస్తున్నా” అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
మైథలాజికల్ మిస్టరీతో ‘వృషకర్మ’..
‘విరూపాక్ష’తో సూపర్ థ్రిల్లర్‌ను అందించిన కార్తీక్ దండు.. ఇప్పుడు నాగచైతన్యతో కలిసి ‘వృషకర్మ’ అనే మిస్టీరియస్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. పురాతన రహస్యాలు, ప్రవచనాలు, నిధి అన్వేషణ, మైథలాజికల్ అంశాల నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు సమాచారం. ఇందులో నాగచైతన్య.. అర్జున్ అనే ట్రెజర్ హంటర్ (నిధి అన్వేషకుడు) పాత్రలో కనిపించనున్నారు. దక్ష అనే హిస్టరీ స్టూడెంట్‌గా, ఆర్కియాలజీ విభాగంలో పరిశోధన చేసే యువతిగా నటిస్తున్నారు. జయరామ్ ప్రొఫెసర్ రంగనాథన్ పాత్రలో నటిస్తున్నారు. 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ.. డార్క్ మ్యాజిక్, అతీంద్రియ శక్తుల ప్రభావంతో భయపెట్టే విలన్‌గా కనిపించనున్నారు.
#Vrushakarma trailer out tomorrow ! #VrushakarmaOnDec4 #Vrushakarmatrailer https://t.co/5Vb3YNMmkV
— chaitanya akkineni (@chay_akkineni) November 24, 2026
రేపే ట్రైలర్.. చైతూ విశ్వరూపం చూడాల్సిందేనా?
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన ‘వృషకర్మ’ టీమ్.. ఇప్పుడు ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. రేపు నవంబర్ 25న ట్రైలర్ విడుదల కానుంది. డిసెంబర్ 4న సినిమా థియేటర్లలోకి రానుంది. మరి కార్తీక్ దండు ‘వృషకర్మ’ ప్రపంచంలో దాగున్న రహస్యాలేంటి? వీటన్నింటికీ రేపటి ట్రైలర్ సమాధానం చెప్పనుంది. మొత్తానికి చైతూ బర్త్‌డే స్పెషల్‌గా వచ్చిన ఈ పోస్ట్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది!
