ఐపీఎల్ 2027కు పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌లు.. బౌలింగ్, ఫీల్డింగ్ బాధ్యతలు వీరికే!

ఐపీఎల్ 2027కు పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌లు.. బౌలింగ్, ఫీల్డింగ్ బాధ్యతలు వీరికే!

Punjab Kings: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ (PBKS) తమ కోచింగ్ బృందంలో కీలక మార్పులు చేస్తోంది. టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే (Paras Mhambrey) ను బౌలింగ్ కోచ్‌గా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ సిబ్బంది రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించేందుకు పంజాబ్ సిద్ధమైనట్లు క్రిక్‌ఇన్ఫో (Cricinfo) నివేదించింది. గత నెలలో మాజీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు జేమ్స్ హోప్స్ (James Hopes), బ్రాడ్ హడిన్ (Brad Haddin) పంజాబ్ జట్టు నుంచి వైదొలగడంతో, వారి స్థానాల్లో వీరిని తీసుకుంటున్నారు. 

పాంటింగ్‌తో మాంబ్రే, టీమిండియా విజయాల అనుభవం:

* కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) సారథ్యంలో పంజాబ్ కింగ్స్ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. 

* పాంటింగ్‌తో పాత అనుబంధం: గతంలో ముంబై ఇండియన్స్ (MI) తరఫున రికీ పాంటింగ్, పరాస్ మాంబ్రే కలిసి పని చేశారు. ఇప్పుడు మళ్లీ పంజాబ్ శిబిరంలో వీరి కాంబినేషన్ సెట్ అవుతోంది.

* టీమిండియా సక్సెస్ ట్రాక్ రికార్డ్: 2021 నుంచి 2024 వరకు రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో మాంబ్రే భారత బౌలింగ్ కోచ్‌గా పని చేశారు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ చేరడం, 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచి 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కరువు తీర్చడంలో మాంబ్రే కీలక పాత్ర పోషించారు.

* ముంబై నుంచి పంజాబ్‌లోకి: ఇటీవలే ముంబై ఇండియన్స్ తమ కోచింగ్ సెటప్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయడంతో మాంబ్రే పరాస్ ఆ జట్టు నుంచి బయటకు వచ్చారు. 

IPL 2026లో ఊహించని మలుపు.. కప్పు కోసం పంజాబ్ వేట: 

* ఇప్పటి వరకు రెండుసార్లు ఫైనల్ (2014లో KKR చేతిలో, 2025లో RCB చేతిలో) చేరినా, ఇంకా ఐపీఎల్ టైటిల్ గెలవని జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. 

* IPL 2026లో మిక్సిడ్ రిజల్ట్స్: 2026 సీజన్‌ను పంజాబ్ అదిరిపోయే రీతిలో ప్రారంభించింది. తొలి 7 మ్యాచ్‌లలో ఒక్క ఓటమి కూడా లేకుండా 6 విజయాలతో దూసుకెళ్లింది. కానీ ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్‌లలో ఓడిపోయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచినా, కేవలం ఒక్క పాయింట్ తేడాతో ప్లేఆఫ్స్ అవకాశాన్ని చేజార్చుకుంది.

* కొత్త బృందంతో పక్కా ప్లాన్: ఈ నేపథ్యంలో అనుభవజ్ఞులైన పరాస్ మాంబ్రే, రాజీవ్ కుమార్ రాకతో బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను బలోపేతం చేసి, 2027 సీజన్‌లో తొలి టైటిల్ సాధించాలని పంజాబ్ కింగ్స్ గురిపెట్టింది.