జెన్సన్ హువాంగ్‌కు హీరో రేంజ్ వెల్‌కమ్: ఎన్విడియా హెడ్‌క్వార్టర్స్‌ ఉద్యోగుల్లో జోష్

జెన్సన్ హువాంగ్‌కు హీరో రేంజ్ వెల్‌కమ్: ఎన్విడియా హెడ్‌క్వార్టర్స్‌ ఉద్యోగుల్లో జోష్

11 రోజుల విరామం తర్వాత ఎన్విడియా సీఈఓగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన జెన్సన్ హువాంగ్‌కు ఉద్యోగులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. సోమవారం కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కార్యాలయంలోకి ఆయన అడుగుపెట్టగానే పండగ వాతావరణం నెలకొంది. ఆఫీసులోని అంతస్తులు, బాల్కనీల వద్ద వందలాది మంది సిబ్బంది బారులు తీరి నిలబడ్డారు. తమ అభిమాన నాయకుడిని చూడగానే చప్పట్లు, ఈలలతో హోరెత్తిస్తూ 'జెన్సన్.. జెన్సన్.. జెన్సన్' అంటూ నినాదాలు చేశారు. ఆ అద్భుత దృశ్యాలను ఉద్యోగులు తమ ఫోన్లలో రికార్డ్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

తన సిగ్నేచర్ బ్లాక్ లెదర్ జాకెట్‌లో ఎంట్రీ ఇచ్చిన హువాంగ్‌ను చూసి కొందరు ఉద్యోగులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన లోపలికి రాగానే పలువురు సిబ్బంది పరుగెత్తుకుంటూ వెళ్లి ఆప్యాయంగా హత్తుకున్నారు. ఒక ఉద్యోగి ఆయన్ను గట్టిగా కౌగిలించుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అనూహ్య ప్రేమకు చలించిపోయిన హువాంగ్.. తన గుండెపై చేయి వేసుకుని ఉద్యోగులకు అభివాదం చేశారు. తనకు 2వ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు హువాంగ్. ఈసారి గతంలో కంటే మరింత మెరుగైన సీఈఓగా పనిచేస్తానని సిబ్బందికి హామీ ఇచ్చారు.

చైనా ఇంటెలిజెన్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అంగీకరించడంతో చెలరేగిన వివాదం కారణంగా హువాంగ్ నవంబర్ 12న తన పదవికి రాజీనామా చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎన్విడియా బోర్డు ఈ అంశంపై చర్చించింది. హువాంగ్ వల్ల దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న బోర్డు, ఆయన్ను ఏకగ్రీవంగా తిరిగి ప్రెసిడెంట్, సీఈఓ, బోర్డు సభ్యుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో హువాంగ్ తనకు ఉన్న ఇతర అఫైర్ల గురించి కూడా బోర్డుకు వివరించారంట.

ALSO READ : ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ: ఒక్కరోజులో ట్రంప్‌కు రూ.140 కోట్లు లాభం!

హువాంగ్ రీఎంట్రీ ప్రకటన రావటంతో స్టాక్ మార్కెట్‌లో ఎన్విడియా షేర్లు ఒక్కరోజే 30 శాతానికి పైగా దూసుకెళ్లాయి. అటు మార్కెట్‌లో కాసుల వర్షం, ఇటు ఆఫీసులో ఉద్యోగుల ఘనస్వాగతంతో హువాంగ్ సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా మొదలైంది. అధ్యక్షుడు ట్రంప్ కూడా తన ఎన్విడియా పెట్టుబడుల నుంచి మంచి లాభాలనే అందుకున్నారు హువాంగ్ రీఎంట్రీతో.