Megaverse: చిరంజీవి పేరులో 'N' మిస్సింగ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన మెగాస్టార్!

Megaverse: చిరంజీవి పేరులో 'N' మిస్సింగ్.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి తొలిసారి ఓటీటీ వేదికపై హోస్ట్ గా సందడి చేయడబోతున్నారు. నెట్ ఫ్లిక్స్ తో కలిసి ఆయన చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో ' మెగావర్స్'  ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా ఈ షో లాంచ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు రావడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ తో సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ షోకు సంబంధించి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ హోర్డింగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. చిరంజీవి పేరులో 'N' అక్షరాన్ని మిస్ చేస్తూ 'CHIRA_JEEVI' అంటూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ వెనుక అసలు మతలబు ఏంటని నెటిజన్లు తెగ చర్చించుకున్నారు. చివరకు ఆ మిస్సింగ్ 'N' అంటే నెట్‌ఫ్లిక్స్ అని స్వయంగా చిరంజీవి రివీల్ చేయడంతో సస్పెన్స్‌కు తెరపడింది. 'ఇది నా అడ్డా' అంటూ ఆయన చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ప్రమోషన్‌కు మరింత హైప్ తీసుకొచ్చింది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం నవంబర్ 30న సాయంత్రం 4:30 గంటలకు హైదరాబాద్‌లో 'మెగావర్స్' గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది షో స్ట్రీమింగ్ ప్రీమియర్ తేదీ అని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఈ షోలో బ్రహ్మానందం, కమల్ హాసన్, నాగార్జున, ప్రభాస్, రవితేజ, నాని, సందీప్ రెడ్డి వంగా, బాబీ, సూర్య దంపతులు వంటి ప్రముఖులు సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బ్రహ్మానందం, సునీల్, సత్యలతో ఎపిసోడ్ల షూటింగ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే పూర్తి గెస్ట్ లిస్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ALSO READ : విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం..

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన చిరంజీవి.. తన తోటి నటీనటులతో ఎలాంటి ముచ్చట్లు పంచుకుంటారు? తెరవెనుక ఆసక్తికరమైన సంగతులు ఎన్ని బయటపెడతారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిరంజీవి నటించిన 'విశ్వంభర'పై కూడా భారీ అంచనాలున్నాయి. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించింది. వెండితెరపై మెగాస్టార్‌గా అలరించిన చిరు.. డిజిటల్ తెరపై హోస్ట్‌గా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అన్న ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది...