Priyansh Arya: టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా యువ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (Priyansh Arya) సరికొత్త చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) లీగ్ దశలో ఢిల్లీ తరఫున ఓపెనింగ్‌కు దిగిన ప్రియాంష్, కేవలం 68 బంతుల్లోనే 181 పరుగులు బాదేశాడు. అతడి ఊచకోతతో ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 275/5 భారీ స్కోరు సాధించింది. 266.18 స్ట్రైక్ రేట్‌తో ఆడిన ప్రియాంష్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 19 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. దీంతో టీ20ల్లో ఇప్పటి వరకు భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు రికార్డును ప్రియాంష్ ఆర్య తన ఖాతాలో వేసుకున్నాడు.
కేఎల్ రాహుల్, తిలక్ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రియాంష్:
గతంలో టీ20ల్లో 150 పరుగుల మార్కు దాటిన భారత బ్యాటర్ల రికార్డులను ప్రియాంష్ ఆర్య సునాయాసంగా తిరగరాశాడు.
* కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్: IPL 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరఫున ఓపెనర్‌గా ఆడిన కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్ (PBKS)పై 67 బంతుల్లో 152* పరుగులు చేసి రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పుడు ఆ రికార్డును ప్రియాంష్ బద్దలు కొట్టాడు.
* తిలక్ వర్మ కూడా వెనకే: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ కెప్టెన్‌గా ఆడిన తిలక్ వర్మ 67 బంతుల్లో 151 రన్స్ చేసి టీ20ల్లో 150 మార్కు దాటిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.
* కెప్టెన్‌గా రెండో బ్యాటర్: టీ20 మ్యాచ్‌లో 150 పరుగులు చేసిన రెండో భారత కెప్టెన్‌గా ప్రియాంష్ నిలిచాడు.
19 సిక్సర్లతో ఫిన్ అలెన్ రికార్డు సమం:
* అత్యధిక సిక్సర్ల జాయింట్ రికార్డు: ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును ఫిన్ అలెన్ (Finn Allen) తో ప్రియాంష్ ఆర్య సమంగా ఉన్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తరఫున వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై ఫిన్ అలెన్ 19 సిక్సర్లు కొట్టాడు.
* ఎమర్జింగ్ ఆసియా కప్‌లో నో ఛాన్స్: ఇప్పటికే భారత్-A తరఫున ఆడిన ప్రియాంష్ ఆర్యకు ఇంకా భారత సీనియర్ టీమ్ నుంచి పిలుపు రాలేదు. తిలక్ వర్మ సారథ్యంలో భారత్-A ఆడుతున్న ప్రస్తుత ఎమర్జింగ్ ఆసియా కప్ జట్టులో ప్రియాంష్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
ALSO READ : వరల్డ్ చెస్ మహా సమరం షురూ.. ఒక్క గేమ్ గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయంటే?
ఎలైట్ గ్రూప్-Bలో ఢిల్లీ దూకుడు.. 4వ విజయంపై నజర్:
ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-B లో ఆడిన 5 మ్యాచ్‌లలో 3 విజయాలతో 12 పాయింట్లు సాధించిన ఢిల్లీ రెండో స్థానంలో కొనసాగుతుంది (NRR: +2.283). 5 మ్యాచ్‌లలో 4 విజయాలతో సౌరాష్ట్ర టాప్‌లో ఉండగా, పంజాబ్, జమ్మూ కశ్మీర్ చెరో 3 విజయాలతో పోటీలో నిలిచాయి. 2017–18 సీజన్ తర్వాత వైట్-బాల్ ట్రోఫీ గెలవని ఢిల్లీ, ఈసారి నాలుగో విజయంతో ముందంజ వేయాలని చూస్తోంది.
🔥 SIX-HITTING CARNAGE FROM PRIYANSH ARYA! 🤯 Priyansh Arya unleashed absolute destruction against Tamil Nadu, smashing 19 SIXES in his breathtaking knock of 181 runs off just 68 balls! An innings for the history books! Disclaimer: Image is generated by AI. #PriyanshArya #DELvsTN #SMAT2026
— CricInformer (@CricInformer) November 24, 2026
🚨 PRIYANSH ARYA HAS CREATED HISTORY! 🥶 155 off just 60 balls against Tamil Nadu in SMAT. He has broken KL Rahul’s record for the highest individual score by an Indian in T20 cricket. 🤯🔥 WHAT A MONSTER KNOCK! 🫡 https://t.co/0B3890kfP7
— VARAHA WARRIOR (@VarahaWarrior) November 24, 2026
