ఫార్టీస్ ఏజ్‌లో బెల్లీ ఫ్యాట్ సమస్యగా మారుతోంది. పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయి అన్ని రకాల ఇబ్బందులకు కారణమవుతోంది. అయితే అది పెరుగుతున్నప్పుడే కంట్రోల్ చేయాలి. లేదంటే బాగా పెరిగాక దాన్ని తగ్గించడం కష్టం. అయితే దీనికోసం జిమ్‌లు, స్ట్రాంగ్ డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కాస్త లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలు పొట్ట, పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ తగ్గుతుంది.
మజిల్ మాస్ కోల్పోతే..
ఫార్టీస్ తరువాత పొట్టచుట్టూ పెరిగిపోయే కొవ్వును తగ్గించడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే కొవ్వును తగ్గించే మజిల్ మాస్ శక్తిని కోల్పోతుంది. వయసు పెరుగుతున్నకొద్దీ మజిల్ లాస్ అవుతూ ఉంటుంది. పైకి మజిల్ బాగున్నట్లు కనిపించినప్పటికీ వాటిలో సాంద్రత ఉండదు. స్ట్రెంత్, ఎనర్జీ, మొబిలిటీ ఈ మూడింటికీ మజిల్ మాస్ చాలా అవసరం. ఇది సరిగా లేకపోతే మెటబాలిజం మందగిస్తుంది. అంటే తక్కువ క్యాలరీలు మాత్రమే కరిగించగలుగుతుంది.
అందువల్లే వయసు పైబడుతున్నవాళ్లు బరువు తగ్గడం కష్టం అవుతుంది. కానీ మజిల్ శక్తిని పుంజుకునేందుకు సరైన డైట్ తీసుకుంటే వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది. అందుకే ఫార్టీస్లో ఉన్నవాళ్లు డైట్ చార్ట్‌ను తప్పనిసరిగా మెయింటెయిన్ చేయాలి.
జబ్బులకు ఆస్కారం
ఫ్యాట్‌ను ముందే తగ్గించుకోకపోతే ఎన్నో రకాల జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్. శరీరంలో ఇతర భాగాల్లో ఉండే ఫ్యాట్ తగ్గడం కంటే పొట్ట దగ్గర కొవ్వు తగ్గడం చాలా అవసరం. ఇక్కడ పెరిగే కొవ్వుతోనే శరీరం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ ప్రదేశంలో కొవ్వు పెరుగుతూ పోతే గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, హైబీపీ, ఒబెసిటీ వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శ్వాసకోశ ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.
ఒత్తిడికి దూరంగా
మైండ్ పై ఎంత ఒత్తిడి ఉంటే బాడీ అంత ఎక్కువగా పెరిగిపోతుంది. ఒక స్టడీ ప్రకారం ఒత్తిడి, ఆందోళనలు శరీరంలో హార్మోన్ స్థాయిని పెంచుతాయి. జీవక్రియను తగ్గిస్తాయి. జీవక్రియ తగ్గితే బరువు తగ్గే అవకాశాలు తగ్గిపోతాయి. ఇది బెల్లీ ఫ్యాట్ పైనే ఎక్కువగా పడుతుంది. కష్టమైన వ్యాయామాలు, స్ట్రాంగ్ డైట్ చేసినా కూడా ఫ్యాట్ తగ్గదు. అందుకే ఒత్తిడి తగ్గించుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ ను మ్యానేజ్ చేసుకోవాలి. యోగా, మెడిటేషన్ వంటివి క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. అప్పుడే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించొచ్చు.
వర్కవుట్స్ మస్ట్
వర్కవుట్స్ చేయడం వల్ల బరువు తగ్గుతారన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ శరీరం వ్యాయామానికి అనుకూలించదు. ఇలా ఉంటే బరువు తగ్గలేరు. అందుకే డైలీ లైఫ్ లో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక టైంలో వీలైనన్ని ఎక్సర్సైజులు చేస్తుండాలి. ముఖ్యంగా మార్నింగ్ వర్కవుట్స్ బరువును తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తాయి.
ALSO READ : ఈ నాలుగు భయాలు లేనివాడే ఏదైనా సాధిస్తాడు.. చిరంజీవిగా నిలుస్తాడు..!
మార్పులు చేయాలి
బెల్లీ ఫ్యాట్ తగ్గించాలనుకునేవాళ్లు కచ్చితంగా డైట్ చార్ట్ మార్చాలి. వర్కవుట్స్ చేసేటప్పుడు ఎక్కువ ఒత్తిడిని శరీరం మీద పెట్టాల్సి వస్తుంది. అందుకోసం ప్రొటీన్స్ తీసుకోవడం చాలా అవసరం. ప్రొటీన్ ఫుడ్ రోజూ వ్యాయామం చేయడానికి అవసరమయ్యే శక్తి అందిస్తుంది. ఫ్యాటీ ఫుడ్ ని పూర్తిగా మానాలి
షుగరు దూరంగా
చాలామంది అవసరానికి మించి షుగర్ ను వాడుతుంటారు. అలాంటివాళ్లకి ఫ్యాట్ కరగడం కష్టం. అందుకే పూర్తిగా షుగర్‌ను మానేయాలి. చక్కెరతో చేసే స్వీట్స్ కు దూరంగా ఉండాలి. ఇవి తినడం ఆపకపోతే బరువు పెరుగుతారే గానీ తగ్గరు..
మంచి నిద్ర అవసరం
నిద్రలేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే బరువు పెరుగుతుంది. అందుకే మంచినిద్ర అవసరం. ప్రతిరోజూ కచ్చితంగా ఎనిమిది గంటల నిద్ర ఉండాలి. ఆ నిద్ర కూడా డీప్ స్లీప్ అంటే గాఢ నిద్ర పోవాలి. డీప్ స్లీప్ పోతే ఎలాంటి వ్యాయామాలు చేసినా శరీరం తట్టుకుంటుంది. దానివల్ల బరువు తగ్గుతుంది. కానీ నిద్ర లేకుండా వ్యాయామాలు చేస్తే డైట్ కంట్రోల్ చేసినా లాభం ఉండదు.
