నా గురించి ఎక్కువ మాట్లాడితే తాట తీస్తా : తండ్రి లాంటి పెద్ద మనిషికి పృథ్వీ షా వార్నింగ్

నా గురించి ఎక్కువ మాట్లాడితే తాట తీస్తా : తండ్రి లాంటి పెద్ద మనిషికి పృథ్వీ షా వార్నింగ్

టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మరోసారి వార్తల్లో నిలిచాడు. యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) తనపై చేసిన ఘాటు వ్యాఖ్యలపై షా తీవ్రంగా స్పందించాడు. తన గతాన్ని, వ్యక్తిగత జీవితాన్ని అడ్డుపెట్టుకుని నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తే, పరువుకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే లీగల్ యాక్షన్ (చట్టపరమైన చర్యలు) తీసుకుంటానని తేల్చిచెప్పాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోతో పాటు పెద్ద లెటర్ పోస్ట్ చేస్తూ పృథ్వీ షా ఈ వార్నింగ్ ఇచ్చాడు. 

వినోద్ కాంబ్లీతో పోలుస్తూ యువరాజ్ సింగ్ తండ్రి కామెంట్స్: 

స్పోర్ట్స్ లాంచ్‌ప్యాడ్ ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్ మాట్లాడుతూ.. పృథ్వీ షా కెరీర్ పతనానికి అతడి లైఫ్‌స్టైల్ కారణమంటూ వినోద్ కాంబ్లీతో పోల్చారు. 

పృథ్వీ షా ఎందుకు డౌన్ అయ్యాడంటే?: గతంలో వినోద్ కాంబ్లీకి కూడా ఇదే జరిగింది.. పార్టీలు, అమ్మాయిలు, సిగరెట్లు, మందు వల్లే అలా అయింది.. రాత్రి 2.30 గంటలకు రూమ్‌కు వస్తున్న కాంబ్లీని ఒకసారి నేను నిలదీశాను.. నీ రోజులు అయిపోయాయి, మేం వేరే రకమైన క్రికెట్ ఆడుతున్నామని అతడు బదులిచ్చాడు. మరుసటి రోజే కోర్ట్నీ వాల్ష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు, భారత్ ఓడిపోయింది.. తర్వాత ఆ అమ్మాయి వదిలేసింది, మందు సిగరెట్లు ఇచ్చేవాళ్లు లేకుండా పోయారు. పృథ్వీ షా విషయంలోనూ అదే జరిగింది. పార్టీలు, చెడు సావాసాలు చేస్తే ఇలాగే అవుతుందని యోగ్‌రాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.

నన్ను టార్గెట్ చేస్తే ఊరుకోను: పృథ్వీ షా 

యోగ్‌రాజ్ పేరు డైరెక్టుగా ప్రస్తావించకపోయినా, ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా యువ క్రికెటర్ పృథ్వీ షా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సంచలన పోస్ట్ పెట్టాడు. 

* దాచుకునేదేమీ లేదు: నా గత జీవితం గురించి అందరికీ తెలిసిందే.. నాకు దాచుకోవాల్సింది గానీ, సిగ్గుపడాల్సింది గానీ ఏమీ లేదు.. కానీ నా పేరును, నా గతాన్ని వాడుకుని కొందరు కావాలనే నెగెటివిటీ పెంచడం, అనవసర వివాదాలు సృష్టించడం, నా పరువు తీయడం, నా ద్వారా పబ్లిసిటీ పొందడం సహించను అని పృథ్వీ షా పేర్కొన్నారు. 

ALSO READ : 19 సిక్సులు, 4 ఫోర్లు: 68 బంతుల్లో 181 పరుగులతో ప్రియాంష్ ఆర్య విధ్వంసం

* ఇదే ఫైనల్ వార్నింగ్: అభిప్రాయం చెప్పడానికి, నా పరువుకు నష్టం కలిగించేలా టార్గెట్ చేయడానికి చాలా తేడా ఉంది.. నా మౌనాన్ని బలహీనతగా అనుకోవద్దు.. ఇలాంటి పనులు చేసే ఏ వ్యక్తి అయినా, ఏ ప్లాట్‌ఫామ్ అయినా తగిన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే నా చివరి హెచ్చరిక అని పృథ్వీ షా స్పష్టం చేశాడు.