జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2027.. రాత్రంతా ఆన్ లిమిటెడ్ 5G డేటా, కాలింగ్ ఫ్రీ..

జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2027..  రాత్రంతా ఆన్ లిమిటెడ్ 5G డేటా, కాలింగ్ ఫ్రీ..

మీరు జియో సిమ్ వాడుతున్నారా ? అయితే మీకోసం రిలయన్స్ జియో కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. న్యూ ఇయర్ పురస్కరించుకుని 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2027' పేరుతో రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లతో ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు అన్‌లిమిటెడ్ 4G, 5G డేటాను పొందవచ్చు.

ఈ ఆఫర్‌లో భాగంగా రూ.399, రూ.3,999 ధరలతో రెండు రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటితో పాటు రూ.15తో ప్రారంభమయ్యే డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను కూడా అందిస్తోంది. మరి ఈ ప్లాన్లలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

జియో రూ.399 రీఛార్జ్ ప్లాన్
జియో రూ.399 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ 4G, 5G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది. రోజుకు 100 SMSలు కూడా పంపుకోవచ్చు.

ఇవే కాకుండా జియోహాట్‌స్టార్ మొబైల్+ హాలీవుడ్ సబ్‌స్క్రిప్షన్, ఏడాది పాటు కాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్, జియోగేమ్స్ మొబైల్, ఫ్యాన్‌కోడ్, జియోటీవీ వంటి సేవలు కూడా ఫ్రీగా ఉంటాయి. అలాగే 50GB జియోఏఐక్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.

రూ.3,999తో ఏడాది పాటు ఆన్ లిమిటెడ్ డేటా
ఏడాది మొత్తం ఒకే రీఛార్జ్‌తో ఉండాలనుకునేవారి కోసం జియో రూ.3,999 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఇందులో ఆన్ లిమిటెడ్ 4G, 5G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తుంది.

అంతేకాకుండా జియోహాట్‌స్టార్ మొబైల్+ హాలీవుడ్ సబ్‌స్క్రిప్షన్, 12 నెలల కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్, ఫ్యాన్‌కోడ్, జియోటీవీ సేవలు కూడా పొందవచ్చు. వీటితో పాటు 50GB జియోఏఐక్లౌడ్ స్టోరేజ్ కూడా అందిస్తోంది.

రూ.15, రూ.25కే ఆన్ లిమిటెడ్ 5G డేటా
5G డేటా ఎక్కువగా ఉపయోగించేవారి కోసం జియో రెండు కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌లను తీసుకొచ్చింది.

రూ.15 ప్యాక్: ఒక రోజు పాటు ఆన్ లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది.

రూ.25 ప్యాక్: రెండు రోజుల పాటు ఆన్ లిమిటెడ్ 5G డేటా పొందవచ్చు.

తక్కువ ధరలో ఎక్కువ 5G డేటా అవసరమైనవారికి ఈ ప్యాక్‌లు ఉపయోగపడతాయి.

రూ.50తో రాత్రంతా ఆన్ లిమిటెడ్ డేటా
జియో మరో ప్రత్యేక ప్యాక్‌ను కూడా తీసుకొచ్చింది. రూ.50తో రీఛార్జ్ చేసుకుంటే రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆన్ లిమిటెడ్ 4G, 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు.

ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి?
జియో ప్రకటించిన వివరాల ప్రకారం, చాలా న్యూ ఇయర్ ఆఫర్ ప్లాన్లు నవంబర్ 24 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయి. రూ.50 నైట్ డేటా ప్యాక్ మాత్రం నవంబర్ 26 నుంచి అందుబాటులోకి రానుంది.

అయితే రీఛార్జ్ చేసుకునే ముందు మీ నంబర్‌కు ఈ ఆఫర్లు వర్తిస్తున్నాయో లేదో ఒకసారి MyJio యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవడం మంచిది.