కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘నాన్న కుట్టి’ ట్రైలర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ డైలాగ్స్, క్లాసిక్ టచ్, హృదయానికి హత్తుకునే సన్నివేశాలతో ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మరో ఎమోషనల్ హిట్‌కు విజయ్ ఆంటోనీ సిద్ధమవుతున్నారా? అన్న ఆసక్తి నెలకొంది!
తండ్రీకూతుళ్ల ఎమోషనల్ జర్నీ..
‘నాన్న కుట్టి’ కథలో తండ్రీకూతుళ్ల అనుబంధమే ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. కూతురి కోసం తండ్రి చేసే పోరాటం, ప్రేమ, ఎమోషన్స్‌కు యాక్షన్, సస్పెన్స్ అంశాలను జోడించారు. ట్రైలర్‌లోని ఎమోషనల్ సీన్స్, హార్ట్ టచింగ్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కూతురికి ప్రమాదం ఎదురైనప్పుడు ఆమెను కాపాడేందుకు తండ్రి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే నేపథ్యంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్, సస్పెన్స్ అంశాలను కూడా మేళవించారు. తండ్రి ప్రేమలోని మరో కోణాన్ని ఆవిష్కరించేలా కథను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
‘‘దియా.. నీకు అమ్మ అంటే చాలా ఇష్టమా? ఇష్టమే.. మరి అమ్మను చూడలే కదా.. ఎందుకంత ఇష్టం అని నాన్న కూతుళ్ల ఎమోషనల్ మాటలతో ట్రైలర్ మొదలైంది.. నువ్వు దేవుడ్ని చూసావా నాన్న కుట్టి.. నాకు కూడా అమ్మ అలానే.. అని కూతురి చెప్పడం ఎమోషనల్ చేస్తుంది. ఓవైపు కూతురి హెల్త్ ఇష్యూస్, భార్య మిస్టరియస్ క్యారెక్టర్, స్కూల్ టీచర్ మధ్య వచ్చే సీన్స్, అనుమానిత వ్యక్తులని విజయ్ ఆంటోనీ ఫాలో అవ్వడం.. కోర్టు సన్నివేశాలు.. ట్రైలర్ చివర్లో కూతురి ముందు ఏడవలేని తండ్రి సముద్రపు అలల్లో పడుకుని.. కళ్ళని తాకే నీళ్లలో.. తన కన్నీ'ళ్లను రాల్చుకోవడం’’ ఆసక్తి పెంచింది..
విజయ్ ఆంటోనీ మల్టీ టాలెంట్..
ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ హీరోగా నటించడంతో పాటు మ్యూజిక్, ఎడిటింగ్ బాధ్యతలూ చేపట్టారు. హీరోయిన్‌గా ప్రీతి అస్రాని నటిస్తుండగా, లిథన్య శివబాలన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భగవతి పెరుమాళ్, హరిప్రియా ఇసై, అరువి మదన్ తదితరులు ఇతర పాత్రల్లో అలరించనున్నారు. విజయ్ ఆంటోనీ సంగీతం ఈ ఎమోషనల్ జర్నీకి మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది.
ప్రమోషన్లలోనూ విజయ్ ఆంటోనీ వెరైటీ స్టైల్..
‘నాన్న కుట్టి’ ప్రమోషన్లను విజయ్ ఆంటోనీ వెరైటీగా నిర్వహిస్తున్నారు. చెన్నై నుంచి కోయంబత్తూరుకు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించి సర్‌ప్రైజ్ ఇవ్వగా.. హైదరాబాద్ అమీర్‌పేటలో హీరోయిన్ ప్రీతి అస్రానితో కలిసి మిర్చి బజ్జీలు తయారుచేసి అందరినీ అలరించారు. బన్ మస్కా, ఇరానీ చాయ్‌తోనూ సందడి చేశారు. ఈ ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్‌తో సినిమా బజ్‌ను మరింత పెంచారు!
నవంబర్ 27న థియేటర్లలోకి..
మూ. మరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. మీరా విజయ్ ఆంటోనీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తమిళంలో ‘అప్పా కుట్టి’గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ‘నాన్న కుట్టి’ పేరుతో నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొత్తానికి ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్‌తో కూడిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధంతో విజయ్ ఆంటోనీ మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
