క్రికెట్లో కొత్త చరిత్ర రాసిన వైభవ్ సూర్యవంశీ

క్రికెట్లో కొత్త చరిత్ర రాసిన వైభవ్ సూర్యవంశీ

ఉతుకుడు.. ఊచకొట్టుడు.. ఆ కొట్టటం ఏంట్రా బాబూ.. ఇలాంటి మాటలు అన్నీ ఇప్పుడు ఈ ఆట చూస్తే నోటి వెంట వస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసినోళ్లకు.. బ్యాట్ బద్దలయ్యేలా ఊరకొట్టుడు కొట్టాడు. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు బద్దలు అయ్యి.. క్రికెట్ లో సరికొత్త చరిత్ర రాశాడు వైభవ్ సూర్యవంశీ. 

ఇండియా, UAE అండర్ 19 క్రికెట్ పోటీల్లో భాగంగా.. 2026, నవంబరన్ 24వ తేదీన దోహాలో జరిగిన మ్యాచ్ లో.. ఇండియన్ కుర్రోడు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉంది. 52 బంతుల్లోనే 200 పరుగులు.. అంటే ఊహించుకోండి ఏ రేంజ్ లో కొట్టాడో అని.. 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు.. ఆ తర్వాత అయినా తగ్గాడా అంటే అదీ లేదు.. 40 బంతుల్లో 150 పరుగులు చేశాడు.. ఆ తర్వాత ఏ మాత్రం మనోడు తగ్గలేదు. 52 బంతుల్లో 200 పరుగులు చేశాడు. ఫస్ట్ 16 బంతుల్లో 50 పరుగులు చేసిన వైభవ్.. ఆ తర్వాత 12 బంతుల్లోనే మరో 50 పరుగులు చేసి.. సెంచరీ పూర్తి చేశాడు.

వైభవ్ దెబ్బకు అంతకు ముందున్న రికార్డులు చిన్నబోయాయనే చెప్పాలి. తక్కువ బంతులలో డబుల్ సెంచరీ రికార్డు అంతకు ముందు ఇంగ్లండ్ బ్యాటర్ హారీ బ్రూక్ పేరున ఉండేది. 2026లో శ్రీలంకపై 114 బంతులలో 200 పరుగులు సాధించి ఇప్పటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 

ఆ తర్వాత ఇండియన్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ 117 బంతులలో డబుల్ సాధించి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. 2026 లో వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ సాధించాడు గిల్. అయితే వైభవ్ 52 బంతులలో డబుల్ సెంచరీతో ఆ రికార్డులన్నీ వెనకి వరుసలోకి వెళ్లిపోయాయి. 

సెంచరీ, డబుల్ సెంచరీలే కాకుండా 150 పైన ఉన్న రికార్డులు కూడా తిరగరాశాడు వైభవ్.40 బంతులలో 150 రన్స్ మార్క్ ను చేరుకున్న మొదటి ప్లేయర్ గా నిలిచాడు. 

5 ఓవర్లలోనే 100 పరుగులు:

సూర్యవంశీ దూకుడుతో టీమిండియా ఏ జట్టు కూడా చరిత్ర సృష్టించింది. కేవలం 5 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. లిస్ట్ ఏ వన్డే క్రికెట్ లో ఇదే అత్యంత వేగవంతమైన టీమ్ సెంచరీ అని రికార్డులు చెబుతున్నాయి. గతంలో న్యూజిలాండ్ 6.3 ఓవర్లలో చేసిన రికార్డును ఇండియా ఏ జట్టు తిరగరాసింది. 

అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్ మొదటి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగాడు. జాహిద్ అలీ వేసిన తొలి ఓవర్ లోనే మూడు సిక్సర్లు కొట్టాడు. అభిషేక్ శర్మ 5 బంతుల్లో 12 పరుగులు చేసి అవుటైనా వైభవ్ ఏమాత్రం తగ్గలేదు. 

గతంలో లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ (29 బంతులు) పేరిట ఉండేది. ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో, షకీబుల్ గని 32 బంతుల్లో, ఇషాన్ కిషన్ 33 బంతుల్లో సెంచరీలు సాధించారు. వైభవ్ ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ అధిగమించాడు. 

ఈ మ్యాచ్ లో వైభవ్ సూపర్ ఇన్నింగ్స్ తో కేవలం 14.2 ఓవర్లలోనే ఇండియా ఏ గెలిచింది. వైభవ్ స్పీడుతో యూఏఈ 50 ఓవర్లలో ఇచ్చిన 249 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలో ముగించగలిగారు.