గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతిహాసన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. ప్రయోగాత్మక చిత్రాలతోనూ ప్రేక్షకులను మెప్పి స్తోంది. నటిగానే కాకుండా సింగర్‌గా, మ్యూజీషియన్‌గా తనదైన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్న శ్రుతి.. ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో మావీరన్, త్రీ బీహెచ్‌కే వంటి డిఫరెంట్ మూవీస్ నిర్మించిన శాంతి టాకీస్ సంస్థ తన కొత్త చిత్రాన్ని ప్రకటించింది.
ఈ సినిమాలో శ్రుతిహాసన్ లీడ్‌గా నటించనుందని నిర్మాత అరుణ్ విశ్వ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘అశ్విన్స్’ ఫేమ్ తరుణ్ తేజ దర్శకత్వం వహించనున్నాడు. తరుణ్ తేజకు ‘అశ్విన్స్’ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. వసంత్ రవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ విభిన్నమైన కథనం, విజువల్స్, సౌండ్ డిజైన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు శ్రుతి హాసన్‌తో కలిసి ఆయన ఎలాంటి కథను తెరపైకి తీసుకురాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్, కథాంశం, షూటింగ్ షెడ్యూల్ వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
