హైదరాబాద్, వెలుగు: ఇంటర్ డీపీఎస్ జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. రెండు రోజులు సాగిన పోటీల్లో డీపీఎస్ కొల్లూరు, డీపీఎస్ ఘట్‌కేసర్, డీపీఎస్ నాదర్‌గుల్ టాప్–3 స్థానాల్లో నిలిచాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన డీపీఎస్ స్కూల్స్ నుంచి సుమారు 120 మంది ఆర్చర్లు పాల్గొన్నారు.
ఈ చాంపియన్‌షిప్‌లో ఇండియన్, కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో అండర్–10, అండర్–13, అండర్–-15, అండర్–-17లో పోటీలు జరిగాయి. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు డీపీఎస్ కొల్లూరు యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలను సొసైటీ ట్రెజరర్, మాజీ ఐఏఎస్ నమిత్ ప్రధాన్ అభినందించారు. ప్రొ వైస్ చైర్మన్ టి. బీమసేన్, వైస్ చైర్మన్ టి. ప్రణయ్, జనరల్ సెక్రటరీ టీఎస్. పవన్ కళ్యాణ్ విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు.
