వెల్లింగ్టన్: ఇండియాతో రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుడి కాలి తొడ కండర గాయంతో కివీస్ పేసర్ బ్లెయిర్ టిక్నెర్ రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. దాంతో అతని ప్లేస్‌లో మ్యాట్ ఫిషర్‌ను జట్టులోకి తీసుకున్నారు. టిక్నెర్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని కివీస్ బోర్డు వెల్లడించింది. గాయం తీవ్రతను తెలుసుకోవడానికి క్రైస్ట్‌చర్చ్‌లో టిక్నెర్‌కు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ నివేదికను బట్టి టిక్నెర్ అందుబాటులోకి వచ్చే అంశంపై ఓ నిర్ణయానికి రానున్నారు.
