దోహా: ఇండియా క్రికెట్ ‘వండర్ కిడ్’ వైభవ్ సూర్యవంశీ (53 బాల్స్‌లో 7 ఫోర్లు, 28 సిక్సర్లతో 204).. వరల్డ్ క్రికెట్‌లో మరో సంచలనం సృష్టించాడు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో తన సునామీ బ్యాటింగ్‌తో పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఫలితంగా మంగళవారంజరిగిన గ్రూప్–-బి మ్యాచ్‌లో ఇండియా–ఎ జట్టు 7 వికెట్ల తేడాతో యూఏఈపై గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. టాస్ గెలిచిన యూఏఈ 50 ఓవర్లలో 249/8 స్కోరు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ (144 బాల్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 130) సెంచరీ సాధించాడు. తర్వాత ఇండియా 14.2 ఓవర్లలో 254/3 స్కోరు చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. వైభవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
హర్‌ప్రీత్ ఒక్కడే..
యూఏఈ ఇన్నింగ్స్‌లో హర్‌ప్రీత్ మాత్రమే మెరుగ్గా ఆడాడు. 20 రన్స్‌కే ఓపెనర్లు ఆర్యాన్ష్ శర్మ (2), అన్ష్ టాండన్ (8) పెవిలియన్‌కు వచ్చారు. ఇక్కడినుంచి ఓ ఎండ్‌లో హర్‌ప్రీత్ ఒంటరి పోరాటం చేశాడు. ముహమ్మద్ షెహదాద్ (28), ఎతాన్ డిసౌజా (25) ఓ మాదిరిగా ఆడినా.. అఫ్తాబ్ ఆలమ్ (2) ఫెయిలయ్యాడు. దాంతో యూఏఈ 154 రన్స్‌కే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బాసిల్ అహ్మద్ (36 నాటౌట్), హర్‌ప్రీత్ కలిసి ఆరో వికెట్‌కు 66 రన్స్ జత చేశారు. అర్షద్ ఖాన్ 4, హర్షిత్ రాణా, సూర్యాన్ష్ షెడ్జే, హర్ష్ దూబే, షాబాజ్ అహ్మద్ తలా ఓ వికెట్ తీశారు.
రికార్డులే.. రికార్డులు
గత రెండు మ్యాచ్‌ల్లో త్వరగా ఔటైన వైభవ్ ఈ పోరులో మాత్రం స్టార్టింగ్ నుంచే సిక్సర్ల జాతర చూపెట్టాడు. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా తన పవర్ హిట్టింగ్‌తో యూఏఈ బౌలర్లను ఉతికేశాడు. జాహిద్ అలీ (1/52) వేసిన తొలి ఓవర్‌లోనే వైభవ్ హ్యాట్రిక్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఇబ్రార్ అహ్మద్ (1/71) వేసిన రెండో ఓవర్‌లోనూ 4, 6, 6తో 20 రన్స్ దంచాడు. తర్వాతి ఓవర్‌లో మూడు సిక్సర్లతో 16 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌లో అభిషేక్ శర్మ (12).. 4, 6 కొట్టి ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు 68 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
ఇదే ఓవర్‌లో వైభవ్ 6, 4 రాబట్టడంతో 21 రన్స్ వచ్చాయి. సిమ్రన్‌జిత్ సింగ్ వేసిన ఐదో ఓవర్‌లో 6, 6, 6తో 21 రన్స్ దంచాడు. దాంతో ఐదు ఓవర్లలో ఇండియా స్కోరు 100/1కు చేరింది. ఆరో ఓవర్‌లో వైభవ్ సిక్స్ కొట్టినా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (3) ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 40 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. రింకూ సింగ్ (27 నాటౌట్) మెల్లగా ఆడినా.. 7వ ఓవర్‌లో 6, 4, 4తో వైభవ్ 28 బాల్స్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ అందుకున్నాడు. తర్వాత రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 30 రన్స్ చేసి ఓవర్‌ను ముగించాడు. 8వ ఓవర్‌లో 4 రన్స్ వచ్చినా.. 9వ ఓవర్‌లో మూడు సిక్సర్లతో మళ్లీ దుమ్ముదులిపాడు. 10వ ఓవర్‌లో 4, 4, 6, 6తో వేగంగా 150 రన్స్ పూర్తి చేసిన వైభవ్ టీమ్ స్కోరును 183/2కు చేర్చాడు. తర్వాతి ఓవర్‌లో మరో రెండు సిక్స్‌లు కొట్టిన వైభవ్ 12వ ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 28 రన్స్ పిండుకున్నాడు. 13వ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. రెండో వంద రన్స్‌ను 24 బాల్స్‌లోనే సాధించడం విశేషం. ఈ క్రమంలో జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (25 బాల్స్) రికార్డును అధిగమించాడు. కానీ ఐదో బాల్‌కు ఔట్‌కావడంతో మూడో వికెట్‌కు 137 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. అప్పటికి స్కోరు 245/3. విజయానికి కావాల్సిన 9 రన్స్‌ను రింకు, కుమార్ కుశ్రాగ (1 నాటౌట్) అందించారు.
సంక్షిప్త స్కోర్లు
యూఏఈ: 50 ఓవర్లలో 249/8 (హర్‌ప్రీత్ సింగ్ 130, అర్షద్ ఖాన్ 4/43). ఇండియా: 14.2 ఓవర్లలో 254/3 (వైభవ్ 204, రింకూ సింగ్ 27*, బాసిల్ అహ్మద్ 1/59).
లిస్ట్–ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా
వంద (28 బాల్స్), 150 (40 బాల్స్), 200 (52 బాల్స్) రన్స్ చేసిన తొలి బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.
ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు
(28) కొట్టిన తొలి బ్యాటర్ వైభవ్. తన్మయ్ అగర్వాల్
(26)ను అధిగమించాడు.
