అసాధ్యం ఏదీ లేదు.. తప్పుల నుంచి నేర్చుకోవాలి :సైనా నెహ్వాల్ 

అసాధ్యం ఏదీ లేదు.. తప్పుల నుంచి నేర్చుకోవాలి :సైనా నెహ్వాల్ 
  • ఐవిజన్ యూత్ పార్లమెంట్ గ్రాండ్ ఫినాలేలో సైనా నెహ్వాల్ 

హైదరాబాద్, వెలుగు: తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగితే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని ఒలింపిక్ బ్యాడ్మింటన్ పతక విజేత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సైనా నెహ్వాల్ అన్నారు.

హైదరాబాద్ యూసఫ్‌‌‌‌‌‌‌‌గూడలోని శౌర్య కన్వెన్షన్ సెంటర్‌‌‌‌లో రెండు రోజుల పాటు జరిగిన మూడో ఐవిజన్ యూత్ పార్లమెంట్ గ్రాండ్ ఫినాలే ముగింపు వేడుకకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 27 స్కూళ్ల నుంచి 400 మందికిపైగా విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాక్ పార్లమెంట్ సెషన్లు, చర్చలతో విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.