అటవీ సంరక్షణపై ప్రాక్టికల్ పాఠాలు..40వ బ్యాచ్ ఎఫ్‌‌‌‌బీవోల సౌత్ ఇండియా స్టడీ టూర్ సక్సెస్

అటవీ సంరక్షణపై ప్రాక్టికల్ పాఠాలు..40వ బ్యాచ్ ఎఫ్‌‌‌‌బీవోల సౌత్ ఇండియా స్టడీ టూర్ సక్సెస్

హైదరాబాద్, వెలుగు: అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణతోపాటు ఆధునిక శాస్త్రీయ విధానాలపై పట్టు సాధించేందుకు దూలపల్లిలో శిక్షణ పొందుతున్న 40వ బ్యాచ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (ఎఫ్‌‌‌‌బీవోలు) దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ అభయారణ్యాలు, పరిశోధనా సంస్థల్లో విస్తృతంగా పర్యటించారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని టైగర్ రిజర్వ్‌‌‌‌లు, నేషనల్ పార్కులు, ఉద్యానవనాలు, అటవీ కళాశాలలు, కలప పరిశోధనా కేంద్రాలను సందర్శించి విద్యా పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

కాగా, గతంలో ఎఫ్‌‌‌‌బీవోలకు స్టేట్​పరిధిలోనే స్టడీ టూర్​ నిర్వహించేవారు. గ్లోబల్​ లెవల్​లో సమస్యలను తెలుసుకునేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఫారెస్ట్​లకు తీసుకెళ్తున్నారు. గతంలో ఒక బ్యాచ్ ను​తీసుకెళ్లగా.. ప్రస్తుతం రెండో బ్యాచ్ ట్రైనింగ్ పూర్తయ్యింది.  ఈ స్టడీ టూర్ ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు అటవీ, వన్యప్రాణి నిర్వహణ, జీవవైవిధ్య సంరక్షణపై ప్రాక్టికల్ అవగాహన లభించిందని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ మాధవరావు పేర్కొన్నారు.