సీసీపీఎల్‌‌తో జతకట్టిన యూత్‌‌ ఫీడ్‌‌ ఫౌండేషన్‌‌

సీసీపీఎల్‌‌తో జతకట్టిన యూత్‌‌ ఫీడ్‌‌ ఫౌండేషన్‌‌

హైదరాబాద్, వెలుగు: సెంటర్ కోర్ట్ పికిల్‌‌బాల్ లీగ్ (సీసీపీఎల్‌‌) హైదరాబాద్.. తమ సీజన్–2 కోసం అధికారిక ఎన్జీఓ భాగస్వామిగా యూత్ ఫీడ్ ఫౌండేషన్ (వైఎఫ్‌‌ఎఫ్‌‌)తో జతకట్టింది. వెనుకబడిన వర్గాల పిల్లలు, కుటుంబాల సంక్షేమానికి తోడ్పడేందుకు క్రీడలు, సామాజిక బాధ్యతను ఈ భాగస్వామ్యం ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. నిధుల సేకరణ, యూత్ ఫీడ్ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలపై అవగాహన పెంచడం, అలాగే లీగ్ కమ్యూనిటీ సభ్యులు కూడా ఈ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకునేలా అవకాశాలను కల్పించడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

సెంటర్ కోర్ట్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌‌టైన్‌‌మెంట్ ఫౌండర్, యశ్వంత్ బియ్యాల, యూత్ ఫీడ్ ఫౌండేషన్ చైర్‌‌పర్సన్ షాజ్ మెహమూద్ ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు, పెరుగుతున్న క్రీడాకారులు, యజమానుల నెట్‌‌వర్క్, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఆసక్తిగల ప్రేక్షకులతో.. యూత్ ఫీడ్ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మరింత గుర్తింపు, మద్దతును తీసుకురావడానికి తమ వేదికను ఉపయోగించుకోవాలని సీసీపీఎల్ ఆశిస్తోంది.