కాన్‌బెర్రా: టార్గెట్ ఛేజింగ్‌లో అనెరిన్ డొనాల్డ్ (85), ఫిల్ సాల్ట్ (58) చెలరేగడంతో.. మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. టాస్ నెగ్గిన ఆసీస్ 20 ఓవర్లలో 184/8 స్కోరు చేసింది.
నిఖిల్ చౌదరి (45), జోయెల్ డేవిస్ (39), జాక్ ఫ్రేజర్ (27) ఫర్వాలేదనిపించారు. హెన్రీ, సామ్ కరణ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్ 13.1 ఓవర్లలో 188/2 స్కోరు చేసి నెగ్గింది. సాల్ట్, డొనాల్డ్ తొలి వికెట్‌కు 151 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. టామ్ బాంటన్ (26 నాటౌట్) రాణించాడు.
