బంతిపై ఉమ్మి నిషేధం ఎత్తివేతకు ఐసీసీ నో

బంతిపై ఉమ్మి నిషేధం ఎత్తివేతకు ఐసీసీ నో

న్యూఢిల్లీ: బంతిని మెరుగుపరచడానికి ఉమ్మి వాడకంపై ఉన్న నిషేధాన్ని సమీక్షించే ఆలోచన లేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఆరోగ్య, క్రీడా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పింది. టీమిండియా కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరినప్పటికీ ఐసీసీ తన వైఖరికే కట్టుబడి ఉంది. వెల్లింగ్టన్‌‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా న్యూజిలాండ్‌‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం గిల్ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చాడు.

బ్యాటింగ్‌‌కు అనుకూలించే పిచ్‌‌పై కూకాబురా బంతి చాలా త్వరగా మెత్తబడుతోందని, ఉమ్మితో బంతిని మెరుగుపరిచేందుకు అనుమతిస్తే బౌలర్లకు కొంత సహాయం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఐదో రోజు న్యూజిలాండ్ బ్యాటర్లను అవుట్ చేయలేకపోవడంతో ఇండియా కీలకమైన వరల్డ్‌‌ టెస్టు చాంపియన్‌‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లను కోల్పోయింది.  కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల ఆరోగ్య భద్రత కోసం 2020లో ఈ నిషేధాన్ని తాత్కాలికంగా ప్రవేశపెట్టి, రెండేళ్ల తర్వాత శాశ్వతం చేశారు.