ప్రతి క్లోజప్ డైనమైట్‌లా పేలింది.. శర్వా నుంచి ఊహించని పెర్ఫార్మెన్స్ చూస్తారు: సంపత్ నంది

ప్రతి క్లోజప్ డైనమైట్‌లా పేలింది.. శర్వా నుంచి ఊహించని పెర్ఫార్మెన్స్ చూస్తారు: సంపత్ నంది

‘భోగి’ తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేసిన కొత్త సినిమా అని,  ఇప్పటివరకు తాను తెరకెక్కించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించానని దర్శకుడు సంపత్ నంది చెప్పాడు. శర్వానంద్ హీరోగా కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది చెప్పిన విశేషాలు.  

‘‘ఇదొక  రూటెడ్ విలేజ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్ పీరియడ్ యాక్షన్ డ్రామా.  నా చిన్నతనంలో మా ఊరికి సమీపంలోని రామగిరి గుట్ట దగ్గర విన్న ఒక సంఘటన ఈ కథకు ప్రేరణ. ఆ జ్ఞాపకానికి మహారాష్ట్ర బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన మరో సంఘటనను జోడించి, ‘బొగ్గుల గుట్ట’ అనే కల్పిత గ్రామాన్ని సృష్టించాం. అప్పటి పరిస్థితులు, సంస్కృతి, కట్టుబాట్లు, ప్రేమలు, నమ్మకాల నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించాం.  శర్వానంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లుక్ కోసం దాదాపు రెండు నెలలు కష్టపడ్డాం. నాలుగైదు లుక్ ట్రయల్స్ తర్వాత పాత్రకు సరిపోయే రూపాన్ని సిద్ధం చేశాం. ఈ సినిమాలో శర్వా తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడారు. ఆయన నుంచి ప్రేక్షకులు అస్సలు ఊహించని పెర్ఫార్మెన్స్ చూస్తారు.  ప్రతి క్లోజప్ డైనమైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా పేలింది. ఆయన నుంచి వచ్చే సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ప్యాకేజ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది.

 సినిమాలో హింస ఎక్కువగా ఉన్నప్పటికీ కథకు అది అవసరం. సెన్సార్ రివైజింగ్ కమిటీకి వెళ్లినా, మేము చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించలేదు. కొన్ని మ్యూట్స్ మాత్రమే సూచించారు. ఇందులోని మూఢనమ్మకాల నేపథ్యం, వాటి వెనుక ఉన్న అసలు విషయాలను ప్రేక్షకులు థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే చూడాలి.  ఈ సినిమా కోసం 15 ఎకరాల్లో భారీ బొగ్గుల గుట్ట గ్రామాన్ని నిర్మించాం. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైనా నిర్మాత రాధామోహన్ ఎక్కడా రాజీపడలేదు. ఇది మూడేళ్ల ప్రయాణం. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఈ కథకు ప్రధాన భావోద్వేగం. డింపుల్ హయాతి, అనుపమ అద్భుతంగా నటించారు. చంద్రబోస్ ప్రతి పాటను ఎంతో అద్భుతంగా రాశారు. భీమ్స్ సంగీతం సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది.  నా గత సినిమాల తరహాలో కాకుండా కొత్త అనుభూతినిచ్చే యాక్షన్ డ్రామా ఇది’’.