డ్రగ్స్కు నో చెప్పండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్రకు ప్రభాస్ మద్ధతు

డ్రగ్స్కు నో చెప్పండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్రకు ప్రభాస్ మద్ధతు

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి హీరో ప్రభాస్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మద్ధతు తెలిపారు.   యువతకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రభాస్ పిలుపునిచ్చారని 2026 నవంబర్ 24న కిషన్ రెడ్డి తెలిపారు.

మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ పాదయాత్రకు సంబంధించి ప్రభాస్ వీడియో రిలీజ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా ప్రభాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కిషన్ రెడ్డి. నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లోని అంబర్‌పేట నుండి జూబ్లీహిల్స్ వరకు జరగనున్న ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు పిలుపునిచ్చారు.