నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రమాదం.. కాంక్రీట్ మిక్సర్లో ఇరుక్కున్న యువకుడు

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రమాదం.. కాంక్రీట్ మిక్సర్లో ఇరుక్కున్న యువకుడు

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రమాదం జరిగింది. నుమాయిష్ ఎగ్జిబిషన్స్ కోసం చేస్తున్న మరమ్మతులలో యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. 2026 నవంబర్ 24న రోడ్ల మరమ్మతులు చేస్తుండగా కాంక్రీట్ మిక్సర్ లో యువకుడి చేయి ఇరుక్కుంది. 

2027 జనవరి 1 నుండి  నుమయిష్ ప్రారంభం కానుండటంతో.. ఎగ్జిబిషన్ సొసైటీ  గ్రౌండ్స్ లోపల రోడ్ల మరమత్తుల చేయిస్తోంది. సిమెంట్ మిక్స్ చేసే యంత్రంలో 17 ఏళ్ల మైనర్  ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో  మైనర్ చెయ్యి  నుజ్జునుజ్జు అయింది. ఇనుపరాడ్ల సహాయంతో బాలుడిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా కుదరకపోవంతో పోలీసులకు సమాచారం అందించారు.

బేగంబజార్ పోలీసులు , ఫైర్ రెస్క్యూ టీమ్ ఘటన స్థలానికి చేరుకొని , సిమెంట్ మిక్సింగ్ యంత్రం నట్లు విప్పి బాలుడిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం బాలుడిని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.