సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టీ20 ట్రోఫీలో రాణించిన  అమన్‌‌ రావు

సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టీ20 ట్రోఫీలో  రాణించిన  అమన్‌‌ రావు

కోల్‌‌కతా: టార్గెట్​ ఛేజింగ్‌‌లో అమన్‌‌ రావు (59), హిమతేజ (54), రాహుల్‌‌ బుద్ది (39) చెలరేగడంతో.. సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టీ20 ట్రోఫీలో హైదరాబాద్‌‌ కీలక విజయాన్ని అందుకుంది. గ్రూప్‌‌–డిలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్‌‌పై గెలిచింది.

టాస్‌‌ నెగ్గిన గుజరాత్‌‌ 20 ఓవర్లలో 187/7 స్కోరు చేసింది. హర్షల్‌‌ పటేల్‌‌ (41), అశుతోష్‌‌ శర్మ (40 నాటౌట్‌‌), ఉమాంగ్‌‌ కుమార్‌‌ (28), ఖిలాన్‌‌ పటేల్‌‌ (28) రాణించారు. రక్షణ్‌‌ రెడ్డి, ప్రణవ్‌‌ వర్మ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత హైదరాబాద్‌‌ 20 ఓవర్లలో 188/5 స్కోరు చేసి నెగ్గింది. రవి బిష్ణోయ్‌‌ రెండు వికెట్లు పడగొట్టారు. రాహుల్‌‌ బుద్దికి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.