ముస్తాబాద్, వెలుగు : బైక్‌ను డీసీఎం వ్యాన్ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగింది. ఎస్సై జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. బంధనకల్ గ్రామానికి చెందిన స్నేహితులు కస్తూరి మహేందర్ రెడ్డి (23), మొగిలిపూల భరత్ కుమార్ (23), మారెడ్డి జశ్వంత్ రెడ్డి (20) బైక్‌పై సోమవారం రాత్రి 10 గంటల
సమయంలో ముస్తాబాద్ వైపు వస్తుండగా, వెంకయ్యకుంట, బంధనకల్ గ్రామాల మధ్య సిద్దిపేట వైపు వేగంగా వెళ్తున్న డీసీఎం వ్యాన్ వారిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మహేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన భరత్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న జశ్వంత్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం అనంతరం పరారైన డీసీఎం వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
డ్రైవర్‌పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా, మహేందర్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ వద్ద అటెండర్‌గా పనిచేస్తుండటంతో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి పాడె మోశారు.
