జడ్చర్ల, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులకు త్వరలోనే నిధులు విడుదల చేయిస్తానని ఏఐసీసీ ఇన్‌చార్జీ బీఎం సందీప్ స్పష్టమైన హామీ ఇచ్చారని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు.
నియోజకవర్గంలోని రోడ్లు, భవనాల నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల కావడం లేదని ఇటీవల ఎమ్మెల్యే ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో సందీప్ ఆయనతో సమావేశమయ్యారు.
సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్‌ను కలిసి నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యాన్ని వివరించగా, 10 నుంచి 15 రోజుల్లోగా నిధులు వచ్చేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
