ఢాకా: భారత్‌లో రెండేళ్లకు పైగా ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. స్వదేశానికి తిరిగి వెళ్లే తేదీని ఖరారు చేసుకున్నారు. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న నిర్వహించే ‘విజయ్ దివస్’ నాడు మాతృభూమిలో కాలుపెట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం విమానం ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన పత్రాలను అందించాలని హసీనా కోరినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ 'రాయిటర్స్' వెల్లడించింది. ‘2024 ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లాదేశ్ విమానంలోనే భారత్‌కు చేరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఢాకాకు వచ్చేందుకు ప్రభుత్వమే విమాన ఏర్పాట్లు చేయాలని ఆమె కోరుతున్నారు’ అని హసీనా అధికార ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ తెలిపారు. కాగా, హసీనా దేశంలో అడుగుపెట్టగానే ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని బంగ్లాదేశ్ మంత్రి షామా ఒబేద్ ఇస్లాం స్పష్టం చేశారు.
